
42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి
కరీంనగర్‌టౌన్: బీసీల రిజర్వేషన్ 42 శాతం అమలు కోసం ఈ నెల 18న బీసీ సంఘాల నేతలు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఆయా సంఘాల నాయకులు పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని బీసీ, కుల సంఘాల రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడి 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు ఎన్నం ప్రకాశ్, ఆది మల్లేశం, నాగుల కనకయ్యగౌడ్, రాచమల్ల రాజు, రాకేశ్‌చారి, కోడూరి పరశురామ్‌గౌడ్, శ్రీనివాస్, సంపత్‌గౌడ్, అంజయ్య, అరుణ, సురేందర్, సురేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
జయప్రదం చేయాలి
అగ్రకులాలు చేస్తున్న కుట్రలను బీసీలు తిప్పికొట్టాలని, 18న రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని బీసీ హక్కుల సాధ న సమితి జిల్లా అధ్యక్షుడు బుచ్చన్నయాదవ్ పిలుపునిచ్చారు. ప్రధానకార్యదర్శి పిట్టల సమ్మయ్య పాల్గొన్నారు.