
జ్వరం.. దగ్గు.. జలుబు!
వైరల్ ఫియర్
నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు
వైరల్ జ్వరాలతో ఇతర అవయవాలపై ప్రభావం
నాలుగైదు రోజులు మించితే
వైద్య పరీక్షలు తప్పనిసరి
జాగ్రత్తలు అవసరమంటున్న డాక్టర్లు
కరీంనగర్:
ఇటీవల కాలంలో వాతావరణ మార్పులు, వర్షాలు, దోమల విజృంభణ తదితర కారణాలతో వైరల్ జ్వరాలు విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా డెంగీ, టైఫాయిడ్, చికెన్‌గున్యా, మలేరియా వంటి రోగాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఈక్రమంలో సాధారణంగా జ్వరం వచ్చిందంటే చాలామంది చిన్న విషయంగా తీసుకుంటారు. కాగా, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో రోజూ వెయ్యికి పైగా ఓపీ నమోదవుతోంది. కానీ, ఇన్‌పేషెంట్లు చాలా తక్కువగా ఉంటున్నారు. అంటే జ్వరం వచ్చినవారంతా తమకు మందులు రాయండి ఇంటి వద్దే ఉండి వాడుకుంటామని అంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. తీవ్ర జ్వరం ఉన్నా నిర్లక్ష్యంగా మందులు రాయమనే చెబుతుండడంతో వైద్యులు కూడా రాసి పంపిస్తున్నారు.
వైరల్ ఫీవర్ అంటే..
వైరల్ ఫీవర్ అనేది వైరస్ కారణంగా వచ్చేది. వైరస్ కారణంగా శరీర రక్షణ వ్యవస్థ (ఇమ్మ్యూన్ సిస్టమ్), శరీరంలో ఉష్ణోగ్రత పెంచుతుంది. వైరల్ ఫీవర్ వల్ల తలనొప్పి, కడుపునొప్పి, జలుబు, దగ్గు, కీళ్ల నొప్పులు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.
నాలుగురోజులు మించి కొనసాగితే..
వైద్య నిపుణుల సూచన ప్రకారం జ్వరం మూడు నుంచి నాలుగు రోజులకు మించి తగ్గకుంటే వెంట నే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే ఇది సాధారణ వైరల్ కాకుండా డెంగీ, టై ఫాయిడ్, మలేరియా లేదా లివర్, కిడ్నీ సంబంధిత సమస్యల సంకేతంగా కూడా ఉండే ప్రమాదముంది.
జ్వరంతో ఉంటే..
డెంగీ ఫీవర్ : ప్లేట్‌లెట్ల సంఖ్య లోపించి రక్తస్రావానికి కారణమవుతుంది
టైఫాయిడ్ : జీర్ణ సంబంధిత అవయవాలపై ప్రభావం
మలేరియా : కాలేయం (లివర్), కిడ్నీపై ప్రభావం
వైరల్ హెపటైటిస్ : కాలేయంపై తీవ్రమైన ప్రభావం
వైరల్ మెనింజైటిస్ : మెదడు రక్షణ కవచంపై ఇన్ఫెక్షన్

జ్వరం.. దగ్గు.. జలుబు!

జ్వరం.. దగ్గు.. జలుబు!