
కరీంనగర్ అర్బన్: పరిపాలనలో తనదైన ముద్ర వేస్తున్న కలెక్టర్ పమేలా సత్పతి తన గాత్రంతో ప్రత్యేకంగా నిలిచారు. ఇప్పటికే బాలికలు, మహిళల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రస్థాయిలో మన్ననలు పొందిన విషయం విదితమే. కాగా అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టర్ స్వయంగా ‘ఓ చిన్ని పిచ్చుక.. చిన్నారి పిచ్చుక’ అంటూ పాడిన వీడియో పాటను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి బుధవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. హిందీలో స్వానంద్ కిర్కిరే అనే రచయిత రాసి పాడిన పాట కాగా రచయిత, తెలుగు ఉపాధ్యాయుడు నంది శ్రీనివాస్ తెలుగులోకి అనువదించారు. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పాల్గొన్నారు.