
డీసీసీకి 32 సిటీ ప్రెసిడెంట్‌కు 22
కరీంనగర్ కార్పొరేషన్: కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణంలో భాగంగా చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. జిల్లా, నగర అధ్యక్ష స్థానాలు ఆశిస్తున్న వారి నుంచి డీసీసీ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించారు. అధ్యక్ష స్థానాలను ఎంపిక చేసేందుకు ఏఐసీసీ పరిశీలకుల ను నియమించగా, ఆ పరిశీలకులు స్వయంగా దరఖాస్తులు స్వీకరిస్తారని ముందుగా ప్రచారం జరిగింది. కాని పరిశీలకులు సోమవారం సాయంత్రానికి నగరానికి చేరుకోగా, అంతకుముందే డీసీసీ కార్యాలయ కార్యదర్శులు నాత శ్రీనివాస్, దొంతి గోపి ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 18వ తేదీ వరకు కొన సాగనుంది. కాగా డీసీసీ అధ్యక్ష స్థానానికి 32 మంది, సిటీ ప్రెసిడెంట్‌కు 22 మంది దరఖాస్తు చేసుకోవడం పార్టీ వర్గాలనే ఆశ్చర్యానికి గురిచేసింది.
డీసీసీకి 32 దరఖాస్తులు
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష స్థానానికి మొదటి రోజు 32మంది దరఖాస్తు చేసుకున్నారు. వెలిచాల రాజేందర్‌రావు, వైద్యుల అంజన్ కుమార్, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, ఆరెపల్లి మోహన్, పత్తి కృష్ణారెడ్డి, పులి ఆంజనేయులు గౌడ్, కర్ర సత్య ప్రసన్నా రెడ్డి, కాశిపాక రాజేష్, సత్తు మల్లేశం, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఆకారపు భాస్కర్ రెడ్డి, ఉట్కూరి నరేందర్ రెడ్డి, బత్తిని శ్రీనివాస్ గౌడ్, నెల్లి నరేశ్, మహమ్మద్ తాజుద్దీన్, మాచర్ల ప్రసాద్, దాసరి భూమయ్య, తిప్పారపు సంపత్, మహమ్మద్ ఖలీముద్దీన్, మ్యాకల రవీందర్, సయ్యద్ జమాలుద్దీన్, మూల జైపాల్, మహమ్మద్ అబ్దుల్ సలాం, ఎస్‌కే. సిరాజ్ హుస్సేన్, శ్రీపురం నాగప్రసాద్, పడాల రాహుల్, దీకొండ శే ఖర్, రుద్ర సంతోష్, ప్యాట రమేష్, సారంగపాణి, చర్ల పద్మ దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు.
సిటీకి 22
సిటీ కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి 22 మంది దరఖాస్తు చేసుకొన్నారు. బానోతు శ్రావణి నాయక్, ముల్కల ప్రవీణ్, షబానా మహమ్మద్, కొరివి అరుణ్ కుమార్, మహమ్మద్ తాజుద్దీన్, మాచర్ల ప్రసాద్, సయ్యద్ ముజీబ్ హుస్సేన్, కంకణాల అనిల్ కుమార్, సర్దార్ ధన సింగ్, మహమ్మద్ అబ్దుల్ సలాం, అస్తపురం రమేష్ ,ఎస్.కె సిరాజ్ హుస్సేన్, మహమ్మద్ జమాలుద్దీన్, అబ్దుల్ రెహమాన్, బోనాల శ్రీనివాస్, కొట్టె ప్రభాకర్, దీకొండ శేఖర్, గడ్డం శ్రీనివాస్, వీర దేవేందర్ పటేల్, వైద్యులు అంజన్ కుమార్, మహమ్మద్, ఇంతియాజ్ అలీ ఉన్నారు.
నగరానికి వచ్చిన పరిశీలకులు
ఏఐసీసీ పరిశీలకుడు శ్రీనివాస్ మానె, సమన్వయకర్తలు ఆత్రం సుగుణ, శెట్టి సత్యనారాయణలు సోమవారం నగరానికి చేరుకొన్నారు. 18వ తేదీ వరకు ఉమ్మడి జిల్లాలోనే ఉండి ఈ ప్రక్రియ కొనసాగిస్తారు. పరిశీలకులకు ప్రభుత్వ విప్ ఆది శ్రీని వాస్, డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ స్వాగతం పలికారు.