
ప్రజావాణి.. వినరూ!
కరీంనగర్ అర్బన్: సమస్యలతో వేగలేకపోతున్నాం, క్షేత్రస్థాయిలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేస్తే మళ్లీ వారికే విచారణ బాధ్యతలు అప్పగిస్తున్నారని, తమకు పరిష్కారం ఎండమావేనని బాధితులు గగ్గోలు పెట్టారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో బాధితులు సమస్యల ఏకరవు పెట్టగా కలెక్టర్ పమేలా సత్పతి అర్జీలను స్వీకరించారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు చొరవ చూపారు. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, డీఆర్వో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అర్జీలను స్వీకరించారు.