
ధర్మమార్గం అలవర్చుకుంటే సుఖశాంతులు
ధర్మపురి: ధర్మమార్గం అలవర్చుకుంటే భక్తులు సుఖశాంతులతో వర్థిల్లుతారని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సౌజన్యంతో జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలోని బ్రాహ్మణ సంఘం పక్కనున్న శ్రీమఠం స్థలంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం ఆదివారం సాయంత్రం ముగిసింది. అనంతరం శ్రీలక్ష్మినృసింహస్వామి దేవస్థానంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ చాగంటి దంపతులకు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. ఘనంగా సన్మానించారు. ధర్మపురి లక్ష్మినృసింహస్వామిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. దేవస్థానం అభివృద్ధికి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కృషి చేస్తున్నారని కీర్తించారు.
మంత్రుల హాజరు
ఈ కార్యక్రమానికి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు హాజరయ్యారు. దేవస్థానం ఈవో శ్రీనివాస్, ట్రస్ట్ బోర్డు చైర్మన్ జక్కు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
నృసింహుడి సన్నిధిలో ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు