
ఆక్రమణలు తొలగింపు
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో రోడ్డు ఆక్రమణలపై నగరపాలకసంస్థ మరోసారి దృష్టి సారించింది. ‘రోడ్లపైనే దందా’ పేరిట ‘సాక్షి’లో గురువారం వచ్చిన కథనానికి బల్దియా స్పందించింది. ఆదర్శనగర్ వద్ద మంచిర్యాల మెయిన్‌రోడ్డుపై ఆక్రమణ లను గురువారం డీఆర్‌ఎఫ్ సిబ్బంది తొలగించారు.ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల రోడ్డులోనూ ఆక్రమణ తొలగింపు చేపట్టారు. నగరవ్యాప్తంగా ఫుట్‌పాత్, రోడ్ల ఆక్రమణల తొలగింపును కొనసాగిస్తామని ఏసీపీ వేణు తెలిపారు. ఆక్రమణలను తొలగించడం నిరంతర ప్రక్రియ అని, రోడ్లు, ఫుట్‌పాత్‌లు ఆక్రమించి వ్యాపారాలు చేస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీపీఎస్ సంధ్య, డీఆర్‌ఎఫ్ ఇన్‌చార్జీ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
మాట నిలబెట్టుకున్నాం
కరీంనగర్ కార్పొరేషన్: ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన మాటను, ప్రభుత్వంలోకి వ చ్చాక కాంగ్రెస్ నిలబెట్టుకుందని సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. గురువారం నగరంలోని రేకుర్తి బుడగజంగాల కాలనీలో పలువురు లబ్ధిదారు ల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం ప్రొసీడింగ్స్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తామంటూ మాయమాటలు చెప్పి, ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నా రు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లు ఆలస్యమైనందున, లబ్ధిదారుల ఎంపిక కొనసాగుతుందన్నారు. మిగిలిన అర్హులందరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు వస్తాయన్నారు. నాయకులు అస్తపురం రమేశ్, పర్వతం మల్లేశం, అస్తపురం తిరుమల, మ్యాక శ్రీనివా స్, దుబ్బుల రాజయ్య,లచ్చయ్య పాల్గొన్నారు.
బలమున్న చోట బరిలో దిగుతాం
శంకరపట్నం: స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమున్న చోట పోటీలో ఉంటామని, దేశవ్యాప్తంగా కేంద్రమే కులగణన చేస్తే చిక్కులు ఉండేవి కావని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం కేశవపట్నంలో మాట్లాడారు. కేంద్రం కులగణన చేపట్టకపోవడంతోనే రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించి, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లిందన్నారు. బలమున్న చోట సీపీఐ తరఫున ఎన్నికల్లో పోటీలో ఉంటామని, టీపీసీసీ అధ్యక్షుడితో చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, మండల కార్యదర్శి పిట్టల స మ్మయ్య, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బుచ్చన్నయాదవ్, రవి, కల్యాణ్, రామ్‌గోపాల్, రత్నాకర్, రమారావు పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయ లైన్ల ద్వారా నాణ్యమైన విద్యుత్
కొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయ లైన్లు (ఇంటర్ లింకింగ్ వ్యవస్థ) ఏర్పాటు చేసినట్లు టీజీఎన్‌పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈ మేక రమేశ్‌బాబు తెలిపారు. 33కెవీ ఇంటర్ లింక్ లైన్ వ్యవస్థకు, 33/11 కె.వీ. సబ్ స్టేషన్ నుంచి మరో 132/33 కె.వీ సబ్‌స్టేషన్‌కు, 33 కేవీ లైన్ నుంచి మరొక 33 కె.వీ.లైన్‌కు మధ్య అనుసంధానంగా ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా అందచేయడం. ప్రకృతి వైపరీత్యాల సమయం, మెయింటెనెన్స్ సమయంలో ఇతర కారణాల చేత ఒక లైన్‌లో లేదా సబ్ స్టేషన్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన/నిలుపవలసి న సమయంలో ఆయా లైను లేదా సబ్ స్టేషన్ పరిధిలో గల 33/11 కె.వీ.ఇంటర్ లింక్ లైన్ ద్వారా విద్యుత్ సరఫరా అందించడమని వివరించారు. దీంతో విద్యుత్ వినియోగదారులకు అంతరాయాలు జరగకుండా నిరంతర విద్యుత్ సరఫరాకు వీలు కలుగుతుందని అన్నారు.