
స్థానిక ఎన్నికల్లో పొత్తు ఉండదు
విద్యానగర్(కరీంనగర్): ఎంఐఎం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని ఎంఐఎం కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి యాసర్ ఆర్ఫాత్ స్పష్టం చేశారు. సోమవారం రాత్రి కరీంనగర్‌లోని ఎంఐఎం పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని, పార్టీ అభ్యర్థుల విజయానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. కరీంనగర్ అధ్యక్షుడు గులాం అహ్మద్ హుస్సేన్, జీహెచ్‌ఎంసీ మాజీ కార్పొరేటర్ సుబహాన్, నాయకులు బర్కత్ అలీ, హాఫిజ్ యూసుఫ్, ఖమరొద్దీన్, ఆతిన, ఖాజా, ఇబ్రహీం, మాజీ కార్పొరేటర్లు అఖీల్ ఫిరోజ్, శర్ఫుద్దీన్, ఆరిఫ్ అహ్మద్, మాజిద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.