స్థానికంలో కాసుల గోల | - | Sakshi
Sakshi News home page

స్థానికంలో కాసుల గోల

Oct 7 2025 3:45 AM | Updated on Oct 7 2025 3:45 AM

స్థాన

స్థానికంలో కాసుల గోల

నిబంధనలు పాటిస్తాం

గోదావరిఖని: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ వెలుబడటంతో పోలీసులు అప్రమత్తమైయ్యారు. రాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లలో పోలీసు బలగాలను మోహరించారు. నగదు ప్రవాహంపై దృష్టి సారించారు. రూ.50వేల కన్నా ఎక్కువ వెంట తీసుకెళ్తే కచ్చితమైన ఆధారాలు చూపించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. లేకుంటే సీజ్‌ చేస్తామంటున్నారు. ఇదేక్రమంలో ఈనెల 4న రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ కోటపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అంతర్‌రాష్ట్ర సరిహద్దు పారుపల్లి చెక్‌పోస్టు వద్ద రూ.1.90లక్షలను సీజ్‌ చేశారు. మహారాష్ట్రలో ఎన్నికలు లేకపోవడంతో కోడ్‌ విషయం తెలియక కారులో ఓ వ్యక్తి నగదు తీసుకెళ్తున్నాడు. రూ.50వేల కన్నా ఎక్కువ తీసుకెళ్తుండడంతో సీజ్‌ చేశారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో చాలాజరుగుతున్నాయి.

పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో ఆందోళన..

పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో బంగారం, వెండి, ఇతర విలువైన ఆభరణాల కొనుగోలు కోసం పెద్దమొత్తంలో నగదు అవసరం ఉంటుంది. పది గ్రాముల బంగారం కొనుగోలు చేయాలన్నా కనీసం రూ.1.20లక్షలు అవసరం అవుతోంది. ఈక్రమంలో నగదు వెంట తీసుకెళ్లడం తప్పనిసరి. కొంతమంది ఆన్‌లైన్‌ లా వాదేవీల ద్వారా కొనుగోలు చేస్తున్నా.. చాలామంది నగదు రూపేణా లావాదేవీలు జరుపుతున్నారు. ఈక్రమంలో పోలీసులు అధిక డబ్బులు తీసుకెళ్తున్నారని సీజ్‌ చేస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అసలు ఎన్నికలకు సంబంధించిన డబ్బులు చాపకింద నీరులా వెళ్తాయని, ఎన్నికల కమిషన్‌ అతి నిబంధనలతో తాము ఇబ్బందిపడాల్సి వస్తోందన సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బ్రాందీ షాపుల టెండర్లు..

రాష్ట్రప్రభుత్వం బ్రాందీషాపుల టెండర్లను ప్రారంభించింది. రెండేళ్ల కాలపరిమితికి ఒక్కోషాపు వేలంలో పాల్గొనేందుకు రూ.3లక్షలు చెల్లించి డీడీ తీయాలని సూచించింది. దీంతో చాలామంది టెండర్లలో పాల్గొనేందుకు నగదు వెంట తీసుకెళ్లడం సహజం. స్థానిక ఎన్నికల కోడ్‌ కూసిన క్రమంలో తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈక్రమంలో పట్టణాల్లో మినహాయించి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ఈనిబంధన ఉండాలని కోరుతున్నారు.

స్వాధీనం చేసుకున్న సొత్తు

మంచిర్యాల జిల్లా:

నగదు రూ.4.48లక్షలు

లిక్కర్‌ 146లీటర్లు(రూ.65వేలు)

పెద్దపల్లి జిల్లా:

లిక్కర్‌ 48లీటర్లు(రూ.17వేలు)

గంజాయి 5కిలోలు(రూ.1.25లక్షలు)

పీడీఎస్‌రైస్‌ క్వింటాల్‌

చెక్‌పోస్టులు:

మంచిర్యాల జిల్లా:

పారుపల్లి(అంతర్‌రాష్ట్ర), ఇందన్‌పల్లి,

ఇందారం, తాండూర్‌, గూడెం

పెద్దపల్లి జిల్లా:

దుబ్బపల్లి, గుంపుల, ఎక్లాస్‌పూర్‌,

గోదావరి బ్రిడ్జి

పెళ్లిళ్ల సీజన్‌.. బ్రాందీ షాపుల టెండర్లు

రూ.50వేలకుపైగా ఉంటే సీజ్‌ చేస్తున్న పోలీసులు

ఎన్నికల నిబంధనల మేరకు వ్యవహరిస్తాం. నిబంధనలు అతిక్రమించి రూ.50వేలకుపైగా వెంట తీసుకెళ్తే అందుకు తగిన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. లేకుంటే రూ.50వేల కన్నా ఎక్కువ ఉన్నసొమ్మును సీజ్‌ చేస్తాం. జిల్లా సరిహద్దులతోపాటు అంతర్‌ రాష్ట్ర సరిహద్దు అయిన కోటపల్లి మండలం శివారులోని మహారాష్ట్ర బ్రిడ్జి వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేశాం. నగదు, మద్యం రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నాం.

– అంబర్‌ కిశోర్‌ ఝా,

పోలీస్‌ కమిషనర్‌, రామగుండం

స్థానికంలో కాసుల గోల 1
1/1

స్థానికంలో కాసుల గోల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement