ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి

Oct 6 2025 2:06 AM | Updated on Oct 6 2025 2:06 AM

ప్రభు

ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి

కరీంనగర్‌: ప్రభుత్వం గీత కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల వెంకటరమణ అన్నారు. ఆదివారం నగరంలోని సీఐటీ యూ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి తిరుపతిగౌడ్‌ అధ్యక్షతన జరిగిన కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సమావేశంలో పాల్గొ ని మాట్లాడుతూ.. గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ముఖ్యమంత్రికి, మంత్రులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. ఎక్స్‌గ్రేషియా బాధితులే స్వయంగా కలెక్టర్‌ కార్యాలయాల ఎదుట నిరాహార దీక్షలు చేస్తున్నా కనికరం చూపడం లేదన్నారు. కాటమయ్య రక్షణ కవచాల పంపిణీ ఏడాది గడిచినా ఇరవై వేలు మించలేదన్నారు. పెన్షన్‌ రూ.4వేలకు, ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలకు, మద్యంషాప్‌ టెండర్లలో రిజ ర్వేషన్‌ 25శాతానికి పెంచాలని డిమాండ్‌ చేశా రు. అనంతరం కల్లుగీత కార్మిక సంఘంలో చేరి న వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.వెంకటనర్సయ్య, సోషల్‌ మీడియా కన్వీనర్‌ సురుగు రాజేశ్‌, జగి త్యాల జిల్లా కన్వీనర్‌ రమేశ్‌ పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానే

ఇల్లందకుంట/జమ్మికుంట: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానే అని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నా రు. ఇల్లందకుంటలో ఆదివారం ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇల్లందకుంట బీఆర్‌ఎస్‌కు మొదటి నుంచి కంచుకోటనే అన్నారు. రూ. వందలకోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో హుజూరా బాద్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 9వ తేదీ నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీల నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభించాలన్నారు. ఒక్కో గ్రామం నుంచి బీఆర్‌ఎస్‌ కార్యకర్తలంతా కలిసి ఒకే అభ్యర్థిని సూచించి, మంచి మెజార్టీతో గెలిపించాలని అన్నారు. కాగా.. జమ్మికుంటలోని ఎంపీఆర్‌ గార్డెన్‌లో ఆదివారం నిర్వహించతలపెట్టి న బీఆర్‌ఎస్‌ సమావేశం వాయిదా పడింది. వర్షం కారణంగా బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు తక్కువ సంఖ్యలో హాజరుకాగా ఎమ్మె ల్యే కౌశిక్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం మరోమారు ఏర్పాటు చేసుకుందామని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కలెక్టరేట్‌లో దసరా పూజలు

కరీంనగర్‌ అర్బన్‌: కలెక్టరేట్‌లో ఆదివారం మైసమ్మ పూజ నిర్వహించారు. ప్రతీ దసరా పండక్కి నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో మైసమ్మ పూజ నిర్వహిస్తారు. దసరా రోజున గాంధీ జయంతి కావడంతో ఆదివారం నిర్వహించినట్లు నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోట రామస్వామి వివరించారు. ఉమ్మడి జిల్లా కార్యదర్శి శంకరయ్య, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రమేశ్‌, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కె అరుణ, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు జీవన్‌, నగర అధ్యకుడు ఎం.శ్రీనివాస్‌, హుజురాబాద్‌ తాలూక అధ్యక్షుడు కె రమేశ్‌, సహాధ్యక్షుడు కె సోమయ్య, కోశాధికారి లక్ష్మీరాజం, ఉపాధ్యక్షులు రాజలింగం, ఎం. అశోక్‌ పాల్గొన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి1
1/1

ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement