
కాలువ కాదు రోడ్డే!
కరీంనగర్ కార్పొరేషన్: నగరాన్ని మరోసారి వరద ముంచెత్తింది. ఆదివారం కొద్దిసేపు కురిసిన గట్టివర్షానికి ప్రధాన రహదారులు కాలువలను తలపించాయి. కాలనీలు జలమయమయ్యాయి. రాంనగర్ వద్ద కరీంనగర్– సిరిసిల్ల రహదారి మునిగింది. రహదారిపై గంటల పాటు వరద వెళ్లడంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఆర్టీసీ వర్క్‌షాప్, మంచిర్యాల చౌరస్తా సమీపంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. డ్రైనేజీ వ్య వస్థ సక్రమంగా లేకపోవడంతో ఇక్కడ చిన్న వర్షానికే రోడ్లపైకి వరద వస్తోంది. ఇండ్లల్లోకి వరద బుర ద చేరుతోంది. నగరపాలకసంస్థ అధికారులు ఇప్పటికై నా డ్రైనేజీ వ్యవస్థను సరిచేసి, వరదనీరు డ్రైనేజీ ద్వారా సులువుగా వెళ్లేలా చేయాలని కోరుతున్నారు.