సమన్వయంతో పనిచేస్తే మనదే విజయం | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతో పనిచేస్తే మనదే విజయం

Oct 5 2025 2:16 AM | Updated on Oct 5 2025 2:16 AM

సమన్వ

సమన్వయంతో పనిచేస్తే మనదే విజయం

హుజూరాబాద్‌: కార్యకర్తలందరూ సమన్వయ ంతో ముందుకు సాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుందని హుజూ రాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. హుజూరాబాద్‌, వీణవంకలో శనివారం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ రైతులను గుండెల్లో పెట్టుకొని కాపాడుకున్నారని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల గుండెలపై తన్నిందన్నారు. ప్రభుత్వం అసమర్థతతో యూరియా కేంద్రాల వద్ద బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత హుజురాబాద్‌ నియోజకవర్గంలో తట్టెడు మట్టి పోయలేదన్నారు. కల్వల ప్రాజెక్టు నాలుగు మండలాలకు తాగు,సాగు నీరు అందిస్తుందని, వర్షాలకు కట్ట తెగిపోయి రెండేళ్లు గడిచినా మరమ్మతు చేపించడం లేదన్నారు. ప్రాజెక్టును మినీ ఎల్‌ఎండీగా చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. హుజూరా బాద్‌ బీఆర్‌ఎస్‌ అడ్డా అని, నియోజకవర్గంలో అన్నిస్థానాల్లో గులాబీ జెండా ఎగురవేయాలన్నారు. వీణవంక మండలం వల్బాపూర్‌కు చెందిన పలువరు కామిడి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌లో చేరగా కౌశిక్‌రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్‌, సింగిల్‌ విండో చైర్మన్లు ఎడవెల్లి కొండల్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, పరిపాటి రవీందర్‌రెడ్డి, బాలకిషన్‌రావు పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

గన్నేరువరం: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సన్నద్ధం కావాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. శనివా రం గన్నేరువరంలో పార్టీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేశ్‌ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా గంగాడి కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండేళ్లుగా గ్రామాల్లో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గత బీఆర్‌ఎస్‌, ప్రస్తుత కాంగ్రెస్‌ పాలనకు తేడాఏం లేదన్నారు. ఇరు పార్టీలు ప్రజా విశ్వా సం కోల్పోయాయని ఎద్దేవా చేశారు. వచ్చే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచుల ఎన్నికల్లో బీజేపీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం, చంద్రారెడ్డి, అజయ్‌వర్మ, రామచంద్రం, జగన్‌రెడ్డి, శంకర్‌, బాలరాజు, రాము, హరీశ్‌, అనంతరెడ్డి, బలరాంరెడ్డి, చంద్రయ్య, రాజశేఖర్‌, వినయ్‌, శ్రీనివాస్‌రెడ్డి, లింగయ్య, నరసింహస్వామి, సురేందర్‌, కిషన్‌, సురేందర్‌రెడ్డి, జగన్‌, లక్ష్మయ్య, గంగయ్య పాల్గొన్నారు.

కోర్టులో కేసు ఉండగా స్థానిక ఎన్నికలా?

తిమ్మాపూర్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసినా.. దీనిపై కోర్టులో కేసు ఉన్నందున స్పష్టత కరువైందని మానకొండూర్‌ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు. తిమ్మాపూర్‌లో శనివారం మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. రిజర్వేషన్లపై ఎలాంటి స్పష్టత లేకుండా ఎన్నికలకు వెళ్తోందని విమర్శించారు. ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోర్టు చెప్పినా, ఎన్నికల ప్రకటన చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరని, పార్టీ పేరు చెప్తేనే భయపడి పారిపోతున్నారని అన్నారు. ‘ఊరంతా ఒకదిక్కు ఐతే.. మానకొండూర్‌ ఒకదిక్కు’ అని అన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లిని ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’లాగా ఉన్నావని ఎద్దేవా చేశారు. రాంలీలా మైదానాన్ని అందంగా తీర్చిదిద్దిన ఘనత తమదేనని, అందరిని కలుపుకుపోయి రాంలీలాను ఘనంగా నిర్వహించామని అన్నారు. ఈసారి రాంలీలా కమిటీకి సంబంధం లేకుండా చిన్న ఎమ్మెల్యే, పెద్ద ఎమ్మెల్యే వసూలు చేశారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకష్ణారావు, కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, రావుల రమేశ్‌, ఉల్లెంగుల ఏకానందం, శేఖర్‌గౌడ్‌, రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

సమన్వయంతో పనిచేస్తే మనదే విజయం
1
1/2

సమన్వయంతో పనిచేస్తే మనదే విజయం

సమన్వయంతో పనిచేస్తే మనదే విజయం
2
2/2

సమన్వయంతో పనిచేస్తే మనదే విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement