
చికిత్స పొందుతూ డ్యాన్స్ మాస్టర్ మృతి
రామడుగు: మండలంలోని గోపాల్‌రావుపేట గ్రామానికి చెందిన డ్యాన్స్ మాస్టర్ దాసరి శేఖర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు... ఓ ప్రైవేటు పాఠశాలలో డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేస్తున్న శేఖర్ మూడు రోజుల క్రితం పెద్దపల్లి జిల్లా ధర్మారం గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లి అక్కడే పురుగుమందు తాగాడని, బంధువులు కరీంనగర్‌లోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందాడని, శేఖర్‌కు భార్య ఉందని, మృతికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.