ఆయిల్ పాం తోటల్లో పరా గసంపర్కం పూర్తయిన ఆ రు నెలల తర్వాత పంట చే తికందుతుంది. ఆఫ్రికన్ పు రుగులు పూతను పిందె.. కాయగా మార్చడంలో కీల క పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం ఆయిల్ పాం గెల టన్నుకు రూ.19,107గా ఉంది. ప్రతినెలా ఆదాయం పొందవచ్చు.
– శ్యాంప్రసాద్, జగిత్యాల ఉద్యానశాఖాఽధికారి
జిల్లాలో మూడేళ్లు దాటిన అన్ని ఆయిల్ పాం తోటల్లో ఆఫ్రికన్ పురుగులు వదులుతాం. దీనివల్ల పరపరాగ సంపర్కం జరిగి పూతంతా పిందెగా.. తర్వాత కాయగా మారుతుంది. రైతులకు దిగుబడి పెరిగి ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. పురుగులను ప్రత్యేకంగా జిల్లాకు తెప్పించాం.
– విజయ్‌భరత్, లోహియా కంపెనీ ప్రతినిధి
ఆర్నెళ్లలో చేతికందుతుంది