
మేదరుల సమస్యలు పరిష్కరించాలి
విద్యానగర్(కరీంనగర్): ప్రపంచ వెదురు దినో త్సవం సందర్భంగా జిల్లా మేదరి సంఘం ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు మేదర కులస్తులు ర్యాలీ నిర్వహించారు. పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్‌కు అందించారు. మేదరులకు ప్రభుత్వమే వెదురును ఉచితంగా అందించాలన్నారు. మేదరి ఫెడరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. అందుకు తగిన నిధులు అందించాలన్నారు. పేదలకు ఇండ్లు అందించాలన్నారు. జిల్లా మేదర సంఘం అధ్యక్షుడు మధిర రవీందర్, రాష్ట్ర కమిటీ నాయకులు అలిపిరెడ్డి లచ్చయ్య, ఏకుల రాజనర్సు, సిలువేరి సత్యనారాయణ, పిట్టల కనకయ్య, ఏకుల రమేశ్, మదిరే గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.