
గుంత.. డ్రైవర్లకు చింత
చింతకుంట– కొత్తపల్లి బైపాస్ రోడ్డు ప్రమాదకరంగా తయారైంది. రహదారిపై ఏర్పడ్డ గుంతలతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతీ రోజు వందల సంఖ్యలో భారీ వాహనాలు ప్రయాణించే రహదారిపై పెద్దపెద్ద గుంతలేర్పడ్డాయి. వర్షాలతో పెద్దవిగా మారి వాహనాలు ఇరుక్కుపోతున్నాయి. ఈ రహదారిపై ప్రయాణిస్తున్న ఓ లారీ బుధవారం గుంతలో ఇరుక్కుపోయిన దృశ్యం ‘సాక్షి’ కెమెరాకు చిక్కింది. ఆ లారీని బయటకు తీసేందుకు డ్రైవర్, క్లీనర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సంబంధిత అధికారులు స్పందించి ఈ రహదారికి మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.
– కొత్తపల్లి