
కుందనపల్లి రైల్వే వంతెనకు గ్రీన్‌సిగ్నల్
రామగుండం: పెద్దపల్లి జంక్షన్ – రామగుండం మధ్యగల కుందనపల్లి రైల్వేగేట్ (ఎల్‌సీ49) వద్ద వంతెన నిర్మాణానికి రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. వంతెన నిర్మాణానికి రూ.110 కోట్లు వెచ్చిస్తారని, రెండు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తిచేస్తారన్నారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ బుధవారం స్థానిక రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. రామగుండంలో మరిన్ని కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్ల హాల్టింగ్ యోచనలో ఉన్నామన్నారు. పెద్దంపేట రైల్వేగేట్ వద్ద వంతెన నిర్మాణం ప్రతిపాదనలో ఉందన్నారు. కాగా, అంతర్గాం స్పిన్నింగ్, వీవింగ్ మిల్లు కార్మికుల సమస్య పరిష్కరించాలని బర్మా, కాందీశీకుల సంఘం ప్రతినిధి ఇండిబిల్లి రవీందర్, సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలని మసీదు కమిటీ, ఇతర సమస్యలపై రైల్వే బోర్డు సభ్యుడు అనుమాస శ్రీనివాస్ తదితరులు ఎంపికీ వినతిపత్రం అందజేశారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఇటీవల గోదావరిలో గల్లంతైన అక్బర్‌నగర్‌లోని నారకట్ల రాజేశ్ కుటుంబసభ్యులను ఎంపీ పరామర్శించారు.