
ఆలకించండి.. పరిష్కరించండి
కరీంనగర్ అర్బన్: కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి బాధితులతో కిక్కిరిసింది. ఎన్నడూ లేని విధంగా అత్యధిక స్థాయిలో అర్జీలు రాగా ప్రజలను నిలువరించేందుకు యంత్రాంగం శ్రమించింది. వచ్చినవారిలో 30శాతం మంది మళ్లీ మళ్లీ వచ్చినవారే కావడం గమనార్హం. సంఖ్య పెరగడమే తప్ప తగ్గకపోవడం మండలస్థాయి అధికారుల పనితీరుకు తార్కాణం. ప్రధానంగా భూ సమస్యలు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, నివేసన స్థలాల కోసం దరఖాస్తులు అందజేశారు. కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్‌వో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు కె.మహేశ్వర్, రమేశ్ అర్జీలు స్వీకరించారు. పలు దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించేందుకు చొరవ చూపారు. మొత్తం 387 దరఖాస్తులు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను ‘సాక్షి’కి వివరించారు. వివరాలు వారి మాటల్లోనే..
మొత్తం అర్జీలు: 387
ఎక్కువగా మున్సిపల్ కార్పొరేషన్: 76
తహసీల్దార్ సైదాపూర్: 27
తహసీల్దార్ కరీంనగర్‌రూరల్: 18
డీపీవో: 16, తహసీల్దార్ తిమ్మాపూర్: 14
సీపీ ఆఫీస్: 11
ఎంపీడీవో మానకొండూర్: 09