
యూరియా కోసం బతుకమ్మతో నిరసన
యూరియా పంపిణీలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మహిళలు యూరియా బస్తాలపై బతుకమ్మను ఉంచి ఆటాడి నిరసన తెలిపారు. సోమవారం గోపాల్‌పూర్ చౌరస్తాలో బతుకమ్మ ఆడుతున్న మహిళలకు మద్దతుగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రహదారిపై బైఠాయించారు. రాస్తారోకోతో ఇరువైపులా పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో కరీంనగర్ రూరల్, చొప్పదండి సీఐలు నిరంజన్‌రెడ్డి, ప్రదీప్‌కుమార్ ఆధ్వర్యంలో ఆందోళన విరమించేందుకు ప్రయత్నించగా కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే గంగుల పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో బలవంతంగా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కరీంనగర్, దుర్శేడ్ సహకార సంఘాల అధ్యక్షుడు పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి, తోట తిరుపతి తదితరులు పాల్గొన్నారు. – కరీంనగర్‌రూరల్

యూరియా కోసం బతుకమ్మతో నిరసన