
మధ్యాహ్నం వరకే 45 టన్నులు ఖాళీ
కరీంనగర్‌రూరల్: యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. ఉదయమే విక్రయ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి క్యూలైన్లలో పాస్‌బుక్కులు, చెప్పులు పెట్టి నిరీక్షిస్తున్నారు. సోమవారం దుర్శేడ్, కరీంనగర్ సహకార సంఘాలు, నగునూరులోని ఆగ్రోస్ కేంద్రాలకు అన్నదాతలు తరలివచ్చారు. దుర్శేడ్ సంఘం వద్దకు ఉదయం 8గంటలకు రైతులు తరలిరాగా, పోలీస్ బందోబస్తు నడుమ యూరియా పంపిణీ చేశారు. మధ్యాహ్నం 12గంటల వరకే దుర్శేడ్, కరీంనగర్, నగునూరు కేంద్రాల్లో 15 టన్నుల చొప్పున మొత్తం 45 టన్నుల యూరియా బస్తాలు పంపిణీ చేసినట్లు ఏవో సత్యం తెలిపారు. కాగా జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి యూరియా విక్రయాలను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా వానాకాలంలో 41,500 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటివరకు 30వేల టన్నులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఆగస్టులో స్టాక్ కేటాయింపులో జాప్యంతో జిల్లాలో కొరత ఏర్పడిందని, మంగళవారం 5వేల టన్నుల యూరియా వస్తుందని చెప్పారు. రైతులు ప్రత్యామ్నాయంగా నానో యూరియా వినియోగించుకోవాలని కోరారు. దుర్శేడ్ విండో చైర్మన్ తోట తిరుపతి, సీఈవోలు ఎం.రమేశ్, వేణుమాధవ్ పాల్గొన్నారు.