
కుంకుమార్చనలు.. అన్న ప్రసాదాలు
క్యాంపు కార్యాలయంలో భోజనం వడ్డిస్తున్న కలెక్టర్ పమేలా సత్పతి
భగత్‌నగర్ ఛత్రపతి శంభాజీ యువసేన ఆధ్వర్యంలో 108 ప్రసాదాల నైవేద్యం
చిగురుమామిడి: సీతారాంపూర్‌లో కుంకుమ పూజలు
గణపతి పూజల్లో పాల్గొన్న సీపీ గౌస్ ఆలం
కరీంనగర్ జిల్లావ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం కుంకుమార్చనలు.. ప్రత్యేక పూజలు.. అన్న ప్రసాద వితరణలతో ఊరూవాడ మండపాల వద్ద సందడి నెలకొంది. వినాయక పూజల్లో భాగంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అన్నప్రసాద వితరణ చేశారు. కలెక్టర్ పమేలా సత్పతి సొంతంగా భోజనాలు తయారు చేసి, క్యాంపు కార్యాలయంతో పాటు కలెక్టరేట్ సిబ్బందికి స్వయంగా వడ్డించారు. పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో సీపీ గౌస్‌ఆలం ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నప్రసాద వితరణ చేశారు. భగత్‌నగర్‌లోని ఛత్రపతి శంభాజీ యువసేన ఆధ్వర్యంలో గణపతికి 108 రకాల ప్రసాదాలు సమర్పించారు. చిగురుమామిడి మండలం సీతారాంపూర్‌లో మహిళలు కుంకుమ పూజలు చేశారు. – కరీంనగర్ అర్బన్/కరీంనగర్ క్రైం/కరీంనగర్‌కల్చరల్/చిగురుమామిడి

కుంకుమార్చనలు.. అన్న ప్రసాదాలు

కుంకుమార్చనలు.. అన్న ప్రసాదాలు

కుంకుమార్చనలు.. అన్న ప్రసాదాలు