
భవితకు బాట వేయాలి
కరీంనగర్: విద్యారంగంలో ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివని, విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేయాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో బుధవా రం కలెక్టరేట్‌లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధ్యా యులు తల్లిలాంటి వారని, పిల్లలకు చక్కటి విద్యాబుద్ధులు నేర్పాలన్నారు. అవార్డు స్వీకరించిన వారు మాత్రమే కాకుండా చాలామంది ఉపాధ్యాయులు తమ సేవలను గోప్యంగా అందిస్తున్నారన్నారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడు తూ పాఠశాలస్థాయిలో ఉపాధ్యాయులు విద్యార్థులను గమనిస్తూ ఉండాలని, వారు ఎలాంటి ఒత్తిళ్లకు లోనవ్వకుండా చూసుకోవాలని అన్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 43మంది, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 17 మంది ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేశారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, డీఈవో చైతన్య జైనీ, విద్యాశాఖ కోఆర్డినేటర్లు అశోక్‌రెడ్డి, మిల్కూరి శ్రీనివాస్, ఆంజనేయులు, కృపారాణి, జిల్లా సైన్స్ అధికారి జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.