
బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే నజరానా
9వ తరగతి విద్యార్థులకూ సైకిళ్లు అందిస్తా
1 నుంచి 6వ తరగతి విద్యార్థులకు మోదీ కిట్లు
పార్లమెంట్ పరిధిలో అత్యధిక సీట్లను గెలిపించే బాధ్యత నాదే
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
కరీంనగర్‌టౌన్: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కమలం గుర్తుపై పోటీ చేసే అభ్యర్థులను గెలిపించుకుంటే నజరానాలు అందిస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రారావు తొలి సారి కరీంనగర్‌కు విచ్చేసిన సందర్భంగా బుధవా రం పార్టీ శ్రేణులు రేణికుంట టోల్‌గేట్, అల్గునూరు చౌరస్తా వద్ద ఘన స్వాగతం పలికారు. కరీంనగర్‌లోని కొండా సత్యలక్ష్మీ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బూత్ అధ్యక్ష, కార్యదర్శుల సమావేశానికి రామచంద్రారావుతో కలిసి హాజరైన బండి సంజయ్ మాట్లాడారు. ఏ గ్రామంలోనైతే బీజేపీ అభ్యర్థిని ఎంపీటీసీగా గెలి పించుకుంటారో, ఆ గ్రామానికి రూ.5లక్షలు, మండలం అయితే రూ.10 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చా రు. 9వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు , వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ఆరంభంలోనే 1 నుంచి 6వ తరగతి చదివే విద్యార్థులకు మోదీ కిట్లు అందిస్తానని తెలిపారు. 20 నెలల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధికి ఒక్కపైసా ఇవ్వలేదన్నారు. కేంద్ర నిధుల కోసమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారు. బీఆర్‌ఎస్ చేసిన అవినీతిలో బాధ్యలపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడానికి ప్రధాన కారణం కేసీఆర్‌తో కాంగ్రెస్ పెద్దలు లాలూచీ పడటమే అని ఆరోపించారు. అందుకే విచారణల పేరుతో జాప్యం చేస్తున్నారన్నారు. బీజేపీ అభ్యర్థులుగా స్థానిక సంస్థల్లో పోటీచేసే అందరినీ గెలిపించుకునే బాధ్యత తనదేనని బండి సంజయ్ అన్నారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలు గెలిచే అవకాశం లేకపోతే పార్టీ, నామినేటెడ్ పదవులిచ్చి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీలు చిన్నమైల్ అంజిరెడ్డి, మల్క కొమురయ్య, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మాజీ మేయర్లు సునీల్‌రావు, శంకర్, మాజీ డిప్యూటీ మేయర్ రమేశ్ పాల్గొన్నారు.