
ప్రాథమిక విద్య భవితకు పునాది
కరీంనగర్/కొత్తపల్లి/కరీంనగర్‌అర్బన్/చొప్పదండి: ప్రాథమిక విద్య దేశ భవిష్యత్తుకు పునాది అని, ఉపాధ్యాయులందరూ అంకిత భావంతో పనిచేయాలని కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. పద్మనగర్‌లోని పారమిత హెరిటేజ్ స్కూల్‌లో జరుగుతున్న గంగాధర మండల ప్రాథమిక ఉపాధ్యాయుల ఐదురోజుల వృత్యంతర శిక్షణను శుక్రవారం కలెక్టర్ సందర్శించారు. ఉపాధ్యాయులు శిక్షణలో నేర్చుకున్న అంశాలను విద్యార్థులకు బోధించి, పిల్లల సంఖ్యను పెంచాలన్నారు. ఈ విద్యా సంవత్సరంలో జిల్లా ప్రాథమిక పాఠశాలల్లో వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుట్టాలని, దానికి సహకరించాలని కోరారు. ప్రాథమికస్థాయి శిక్షణ మాడ్యూల్‌ను ఆవిష్కరించారు. కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్‌లో స్కూల్ అసిస్టెంట్లకు జరుగుతున్న శిక్షణ తరగతులను డీఈవో జనార్దన్‌రావు సందర్శించారు. వృత్యంతర శిక్షణను ప్రతి ఉపాధ్యాయుడు పొందాల్సిన అవసరం ఉందని, అప్పుడే నైపుణ్యాలను మెరుగుదల పరుచుకొని అభ్యసన ఫలితాలను పొందవచ్చునన్నారు. ఈ శిక్షణలో జిల్లాలోని అన్ని సబ్జెక్టుల స్కూల్ అసిస్టెంట్లు 861 మంది పాల్గొన్నట్లు తెలిపారు. కోఆర్డినేటర్లు కె.అశోక్‌రెడ్డి, ఇ.ఆంజనేయులు, మిల్కూరి శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి చాడ జయపాల్ రెడ్డి, గాజుల రవీందర్, గంగాధర ఎంఈవో ఏనుగు ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
ఫర్టిలైజర్ వ్యాపారులు నిబంధనలు అతిక్రమిస్తే కఠి న చర్యలు తప్పవని కలెక్టర్ పమేలా సత్పతి హెచ్చరించారు. జిల్లాకేంద్రంలోని గాంధీరోడ్డులోని పలు ఎరువుల దుకాణాలు, గోదాములను తనిఖీ చేశా రు. రికార్డులు పరిశీలించి విత్తనాల నిల్వ, అమ్మకా ల వివరాలు తెలుసుకున్నారు.ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ ద్వారా మాత్రమే విక్రయించాలని డీలర్‌కు సూచించారు. అన్ని ఎరువులు, విత్తనాలను గరిష్ట చిల్లర ధర ప్రకారమే విక్రయించాలని ఆదేశించారు. అవసరాన్ని బట్టి ఎరువులు నిల్వ చేసుకోవాలన్నారు. ఏడీఏ కె.రణధీర్ కుమార్, కరీంనగర్ అర్బన్ ఏవో ఎం.హరిత ఉన్నారు.
హెల్త్ స్క్రీనింగ్ పూర్తి చేయాలి
13ఏళ్లు పైబడిన మహిళలకు వందశాతం హెల్త్ స్క్రీనింగ్ పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ పమేలా సత్ప తి సూచించారు. పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. అవుట్ పేషెంట్ విభాగం, లేబరేటరీ, లేబర్ రూమ్, ఫార్మసీ స్టోర్‌ను తనిఖీ చేశారు. బాలింతలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో సాజిదా, వైద్యాధికారి శ్రీకీర్తన పాల్గొన్నారు.
● కలెక్టర్ పమేలా సత్పతి