
ఎస్జీఎఫ్ బిల్లులు రూ.అరకోటి
● 2017 నుంచి అందక ఇబ్బందులు ● అప్పు చేసి క్రీడాపోటీలు నిర్వహించామంటున్న కార్యదర్శులు ● సర్కారు స్పందించాలని వేడుకోలు
కరీంనగర్‌స్పోర్ట్స్: విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు పాఠశాల, కళాశాలస్థాయిల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏటా నిర్వహిస్తున్నారు. మండల, జోన్, జిల్లా, ఉమ్మడి జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిల్లో ఎస్జీఎఫ్ టోర్నీలు నిర్వహిస్తారు. ఫెడరేషన్‌ను ఏటా నిధుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. క్రీడా టోర్నీల బిల్లులు రూ.అరకోటికి పైగా 2017నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–14, 17, 19 విభాగానికి సంబంధించి ఉమ్మడి జిల్లాలో 2017నుంచి రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలు జరుగుతున్నాయి. నేటి వరకు పోటీల నిర్వహణ బిల్లులు, తెలంగాణ జట్లను జాతీయ పోటీలకు పంపించిన బిల్లులు ఉమ్మడి జిల్లా కళాశాలలకు సంబంధించినవి రూ.30లక్షలు, పాఠశాలలకు సంబంధించి రూ.28లక్షలు పెండింగ్‌లో ఉన్నా యి. బిల్లుల మంజూరు కోసం టోర్నీకి సంబంధించిన సమగ్ర వివరాలు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖకు (ఎస్జీఎఫ్ విభాగం) పంపిస్తున్నారు. నిధులు మంజూరు కాకపోతుండడంతో ఎస్జీఎఫ్ కార్యదర్శులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పులు చేశామని ఆవేదన చెందుతున్నారు.
అప్పు తెచ్చి పోటీలు
రెండేళ్లపాటు పెద్దపల్లి జిల్లాకు పాఠశాలల క్రీడా సమాఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహించా. ఇప్పుడు బదిలీపై కరీంనగర్‌కు వచ్చా. పెద్దపల్లిలో పలుక్రీడల్లో ఏడు రాష్ట్రస్థాయి పోటీలు అప్పు తెచ్చి నిర్వహించా. క్రీడాకారులను జాతీయపోటీలకు పంపించాను. రావాల్సిన డబ్బుల కోసం ఎదురుచూస్తున్నాను.
– అంతటి శంకరయ్య, పెద్దపల్లి జిల్లా ఎస్జీఎఫ్ మాజీ కార్యదర్శి
బకాయిలు చెల్లించాలి
ఎస్జీఎఫ్ కళాశాల విభాగంలో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలు నిర్వహించాను. 2017నుంచి పోటీలకు సంబంధించిన బకాయిలు విడుదల కాలేదు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని పోటీలు నిర్వహించి, జిల్లా, రాష్ట్ర పేరును నిలిపాం. ఇప్పటికై న బకాయిలను విడుదల చేయాలి.
– జి.మధుజాన్సన్, ఉమ్మడి జిల్లా కళాశాలల క్రీడా సమాఖ్య కార్యదర్శి

ఎస్జీఎఫ్ బిల్లులు రూ.అరకోటి

ఎస్జీఎఫ్ బిల్లులు రూ.అరకోటి