● అమ్మ కోరిక మేరకు..
మాది గోదావరిఖని. నాకు ముగ్గురు అన్నయ్యలు, ముగ్గురు అక్కయ్యలు. చిన్నప్పుడే నాన్న మొండయ్య చనిపోయాడు. అమ్మ శాంతమ్మనే కష్టపడి మమ్మల్ని పెంచి పెద్దచేసింది. నేను నర్సింగ్ చేయాలని అమ్మ ఆశించింది. అమ్మ కోరిక మేరకే నేను మెడికల్ డిపార్ట్‌మెంట్‌ను ఎంచుకున్న. ఆర్థిక ఇబ్బందులతో నాలుగున్నరేళ్లు స్టూడెంట్ పాస్‌తో రోజూ బస్సుల్లో మంచిర్యాలకు వెళ్లి నర్సింగ్ పూర్తి చేశా. 2014 నుంచి 2017 వరకు గర్ట్స్ జూనియర్ కాలేజీలో కాంట్రాక్టు పద్ధతిలో ఒకేషనల్ నర్సింగ్ లెక్చరర్‌గా పని చేశా. తర్వాత మెరిట్‌తో నాకు నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చింది. పెద్దపల్లి జిల్లా తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలిగా కూడా వ్యవహరిస్తున్న.
– జక్కుల మల్లేశ్వరి, నర్సింగ్ ఆఫీసర్, గోదావరిఖని జీజీహెచ్


