విత్తన ‘సబ్సిడీ’కి మంగళం | - | Sakshi
Sakshi News home page

విత్తన ‘సబ్సిడీ’కి మంగళం

May 10 2025 12:13 AM | Updated on May 10 2025 12:13 AM

విత్త

విత్తన ‘సబ్సిడీ’కి మంగళం

● వరి విత్తనాలపై రాయితీ ఎత్తేసిన ప్రభుత్వం ● గతంలో 30కిలోల బస్తాకు రూ.550.. ప్రస్తుతం రూ.వెయ్యి ● అన్నదాతపై అదనపు భారం

వీణవంక(హుజూరాబాద్‌): వరి విత్తనాలపై ప్రభుత్వం సబ్సిడీ ఎత్తేయడంతో రైతులపై అధనపు భారం పడుతోంది. అసలే మొగిపురుగు, ఇతర తెగుళ్లుతో ఏటా రైతాంగం నష్టాలను చవిచూస్తుంటే విత్తనాలకు రాయితీ లేకపోవడంతో మరింత ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ, ఆంధ్ర రకాలకు గతంలో సబ్సిడీ వర్తించేది. కానీ, సబ్సిడీ ఎత్తేయడంతో రైతులపై అధనంగా రూ.300 భారం పడుతుంది. యాసంగి సీజన్‌ ముగియడం.. ఈ నెల 25న రోహిణి కార్తే ప్రారంభం కానుండటంతో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడు జిల్లాలో 2.75 లక్షల ఎకరాల్లో వరి సాగులోకి రానున్నట్లు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.

రైతులపై అదనపు భారం

తెలంగాణ వరి రకాలకు 30 కిలోల బస్తాకు నాలుగేళ్ల క్రితం రూ.550 ధర ఉండగా, యాసంగిలో రూ.వెయ్యికి పెరిగింది. తెలంగాణ రకాలకు కిలో రూ.10, ఆంధ్ర రకాలపై కిలోకు రూ.5ల చొప్పున సబ్సిడీ ఉండేది. కానీ... ఈ సారి ఆ అవకాశం లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. సన్నరకాలు (బీపీటీ) 25కిలోల బస్తాకు గత యాసంగిలో రూ.900, దొడ్డురకం రూ.వెయ్యి ధర ఉండగా ఇప్పుడు మరింత పెరుగనున్నాయి. జిల్లా రైతులు ఎక్కువగా సొసైటీలు, ఆగ్రోస్‌, డీసీఎంస్‌ల ద్వారా విత్తన బస్తాలు కొనుగోలు చేస్తుంటారు. ప్రభుత్వం సన్నరకం వరికి బోనస్‌ ఇస్తుండటంతో సీజన్‌లో వాటికి డిమాండ్‌ పెరుగనుంది.

మొగి పురుగుతో పరేషాన్‌..

మూడేళ్లుగా మొగిపురుగు విజృంభిస్తుండటంతో రైతులు ఖరీదైన రసాయన మందులు పిచికారీ చేసినా పంటను కాపాడుకోలేకపోతున్నారు. ఈ ప్రభా వం ముందస్తు వేసిన వరి నాట్లపైన ఉంటుంది. గత యాసంగిలో పంట చేతికి వచ్చే దశలో వేరుకుళ్లు వ్యాప్తి చెందడంతో ఎకరాకు 40 బస్తాల పైనే దిగుబడి వస్తుందని ఆశించిన రైతులకు 35 బస్తాల చొప్పున దిగుబడి వచ్చింది. కొనుగోలు కేంద్రాల్లో ఇంకా ధాన్యం నిల్వలు ఉన్నాయి. నత్తనడకన కొనుగోళ్లు జరుగుతుండటంతో రైతులు ఇబ్బందులు ప డుతున్నారు. గత చేదు అనుభవాలను దిగమింగు తూ వానాకాలం పంట సాగుకు రైతులు సిద్ధమవుతుండగా సబ్సిడీ విత్తనాల భారం కుంగదీస్తుంది. ఇప్పటికై నా ప్రభుత్వం కలుగజేసుకొని వరి విత్తనాలకు సబ్సిడీ అందించాలని రైతులు కోరుతున్నారు.

విత్తన ధరలను నియంత్రించాలి

వరి విత్తనాలపై సబ్సిడీ లేకపోవడంతో రైతులు నష్టపోవాల్సి వస్తుంది. విత్తన కంపెనీలు ఇష్టానుసారంగా ధరలు పెంచాయి, దీంతో చిన్న, సన్నకారు రైతులపై ప్రభావం పడుతుంది. ధరలను ప్రభుత్వం నియాంత్రించాల్సి ఉండగా తమకేం సంబంధం లేనట్లుగా వ్యవహరించడం తగదు. గతంలో కిలోకు రూ.10 చొప్పున సబ్సిడీ ఉండటంతో కొంత భారం తగ్గింది. ఇప్పటికై నా ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు ఇచ్చేలా చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలి. – అప్పని హరీశ్‌వర్మ, రైతు,

రామకృష్ణాపూర్‌

విత్తన ‘సబ్సిడీ’కి మంగళం1
1/1

విత్తన ‘సబ్సిడీ’కి మంగళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement