
క్రైస్తవ ఉజ్జీవ మహాసభలు
కరీంనగర్ కల్చరల్: జిల్లా కేంద్రంలోని సేయింట్ మార్క్ చర్చి గ్రౌండ్‌లో స్థానిక సీఎస్‌ఐఐ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం క్రైస్తవ ఉజ్జీవ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వైజాగ్‌కు చెందిన జాతీయ అంతర్జాతీయస్థాయి గుర్తింపు పొందిన ప్రవచకుడు డాక్టర్ ఎం.జేమ్స్ స్టీఫెన్ ప్రసంగించారు. ఏసుక్రీస్తు మానవీయ విలువలు, గుణగణాలు మానవ జీవితాలకు ఎలా అన్వయింపజేసుకోవాలో, ఆచరించాలో వివరించారు. ఈ కార్యక్రమంలో సి.రాములు, ఇమ్మానుయేలు, ఎస్.జాన్, పాల్ కొమ్మాలు, ఆర్.ప్రసాద్, బి.ప్రసాద్, ఎ.మధుమోహన్, పింటు, రోజి, ఎస్.సత్యానందం, రెనాల్డ్, నారాయణ, మాణిక్యరావు, రాధిక, ఇండిపెండెంట్ పాస్టర్స్, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.