
జై శ్రీరాం.. జై హనుమాన్
ఆదివారం శ్రీ 13 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
● ఘనంగా హనుమాన్ చిన్న జయంతి ● అట్టహాసంగా వీరహనుమాన్ విజయయాత్ర
కరీంనగర్‌టౌన్/కరీంనగర్‌క్రైం: రామలక్ష్మణ జానకీ జైబోలో హనుమాన్‌కీ.. జై శ్రీరాం.. జై హనుమాన్ నామస్మరణలతో నగరంలోని ఆలయాలు మార్మోగాయి. శనివారం హనుమాన్ చిన్నజయంతి సందర్భంగా ఆలయాలు కిక్కిరిశాయి. సాయంత్రం విశ్వహిందూ పరిషత్, భజరంగదళ్ ఆధ్వర్యంలో వీరహనుమాన్ విజయయాత్ర పేరుతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. గాంధీరోడ్ రామాలయం వద్ద వీహెచ్‌పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ రాంసింగ్ యాత్రను ప్రారంభించారు. టవర్‌సర్కిల్, రూరల్ పోలీస్‌స్టేషన్, కమాన్, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్, బస్టాండ్, గీతాభవన్, కోర్డు, మంచిర్యాల చౌరస్తా, గాంధీరోడ్ చౌరస్తా మీదుగా హనుమాన్ ఆలయానికి ర్యాలీ చేరుకుంది. యాత్రకు 450 మందితో పటిష్టమైన బందోబస్తు నిర్వహించినట్లు సీపీ గౌస్‌ఆలం వెల్లడించారు. వీహెచ్‌పీ బాధ్యులు ఇనుగంటి మునీందర్, గో రక్షా రాష్ట్ర కమిటీ మెంబర్ రాధాకృష్ణారెడ్డి, వీహెచ్‌పీ నగర అధ్యక్షుడు ఇనుగుర్తి రమేశ్, భజరంగదళ్ బాధ్యులు తోట ప్రదీప్, కన్నం శంకర్ పాల్గొన్నారు. కొండగట్టుకు వేలాది మంది తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని ఇరుముడులు సమర్పించి మాల విరమణ చేశారు.
న్యూస్‌రీల్

జై శ్రీరాం.. జై హనుమాన్

జై శ్రీరాం.. జై హనుమాన్

జై శ్రీరాం.. జై హనుమాన్

జై శ్రీరాం.. జై హనుమాన్

జై శ్రీరాం.. జై హనుమాన్

జై శ్రీరాం.. జై హనుమాన్

జై శ్రీరాం.. జై హనుమాన్

జై శ్రీరాం.. జై హనుమాన్

జై శ్రీరాం.. జై హనుమాన్