
ఆకట్టుకున్న ‘టెడ్‌ఎడ్ టాక్స్’
కరీంనగర్: కరీంనగర్‌లోని కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎంవోయూలో భాగంగా పారమిత, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు శుక్రవారం టెడ్‌ఎడ్‌టాక్స్ నిర్వహించారు. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ, పారమిత విద్యాసంస్థల చైర్మన్ ఈ.ప్రసాద్‌రావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జెడ్పీహెచ్ కొత్తపల్లిలో 9వ తరగతి చదువుతున్న ఎన్. అక్షయ, జెడ్పీహెచ్‌ఎస్ చల్లూరులో 10వ తరగతి చదువుతున్న విష్ణు, టీజీఎంఎస్ గంగాధరలో 9వ తరగతి చదువుతున్న శ్రీవల్లి, జెడ్పీహెచ్‌ఎస్ గర్శకుర్తిలో పదోతరగతి చదువుతున్న రితిక తమ టెడ్ టాక్స్‌తో ఆకట్టుకున్నా రు. పారమిత విద్యార్థులు రితీష, విజ్ఞత, లాస్య, అక్షత, నిత్య, చైత్య ఆసక్తికరమైన అంశాలతో అనర్గళంగా మాట్లాడుతూ ఆశ్చర్యపరిచారు.
మంత్రి అడ్లూరిని కలిసిన ఆర్టీసీ ఆర్‌ఎం రాజు
కరీంనగర్: ధర్మపురి ఎమ్మెల్యే, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను కరీంనగర్‌లోని ఆయన నివాసంలో ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి.రాజు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ధర్మపురి నియోజకవర్గంలో ప్రయాణికులకు తగిన బస్సులు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. డిప్యూటీ రీజినల్ మేనేజర్ ఎస్.భూపతిరెడ్డి, కరీంనగర్–2 డిపో మేనేజర్ ఎం.శ్రీనివాస్ ఉన్నారు.
శుక్రవారం సభ సమస్యల పరిష్కార వేదిక
కరీంనగర్: మహిళా సమస్యల పరిష్కారానికి శుక్రవారం సభ వేదికగా నిలుస్తుందని సీడీపీవో సబిత పేర్కొన్నారు. మహిళా అభివృద్ధి, శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని వావిలాలపల్లి–3 అంగన్‌వాడీ కేంద్రంలో జరిగిన శుక్రవారం సభలో పాల్గొని మాట్లాడారు. ప్రతీ గర్భిణి, బాలింత తప్పక హాజరు కావాలని సూచించారు. డీఎంహెచ్‌వో వెంకటరమణ మాట్లాడుతూ ఆరోగ్య మహిళా కార్యక్రమంలో సుమారు 50రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామన్నారు. మెప్మా శ్రీవాణి, హెచ్‌ఎం జ్యోతిలక్ష్మి, డీసీపీవో ఫర్వీన్, వైద్యాధికారి ఇమ్రాన్‌ఖాన్ పాల్గొన్నారు.

ఆకట్టుకున్న ‘టెడ్‌ఎడ్ టాక్స్’

ఆకట్టుకున్న ‘టెడ్‌ఎడ్ టాక్స్’