రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీ | - | Sakshi
Sakshi News home page

రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీ

Apr 5 2025 1:50 AM | Updated on Apr 5 2025 1:50 AM

రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీ

రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీ

● మంత్రి పొన్నం ప్రభాకర్‌

చిగురుమామిడి: దేశప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని రచించారని, అహింస పద్ధతిలో బాపూజీ దేశస్వాతంత్య్రం కోసం ఉద్యమించారని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లిలో శుక్రవారం నిర్వహించిన జై భీమ్‌, జై బాపు, జై సంవిధాన్‌ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా కేంద్రంలోని బీజే పీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్‌ ఈ ఉద్యమానికి శ్రీకా రం చుట్టిందన్నారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ గీకురు రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు కవి సమ్మేళనం

కరీంనగర్‌ కల్చరల్‌: జాతీయ సాహిత్య పరిషత్‌, కొత్తపల్లి శ్రీవేంకటేశ్వర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 9:30 గంటలకు కొత్తపల్లి హవేలి, చిన్నగుట్టపై (సచ్చిదానందాశ్రమం) వసంతోత్సవం పేరుతో శ్రీ వేంకటేశ్వర, శ్రీరామ వైభవాలు అంశాలుగా కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు గాజుల రవీందర్‌, నంది శ్రీనివాస్‌ తెలిపారు. అనంతరం పండిత సత్కారం ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా ఐపీఎస్‌ అధికారి వసుంధర యాదవ్‌, ప్రధాన వక్తగా ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, డాక్టర్‌ గండ్రలక్ష్మణరావు, వడ్లూరి ఆంజనేయరాజు, డాక్టర్‌ ఎల్‌.రాజభాస్కరరెడ్డి, నరహరి నారాయణరెడ్డి, బండ గోపాల్‌రెడ్డి హాజరవుతారని తెలిపారు.

క్వింటాల్‌ పత్తి రూ.7,580

జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌కు శని, ఆదివారం సెలవు ఉంటుందని మార్కెట్‌ ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, కార్యదర్శి రాజా తెలిపారు. శుక్రవారం క్వింటాల్‌ పత్తి రూ. 7,580 పలికిందని వారు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement