ఎన్నికలు ఎప్పుడొచ్చిన సిద్ధంగా ఉండండి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలు ఎప్పుడొచ్చిన సిద్ధంగా ఉండండి

Feb 14 2025 10:39 PM | Updated on Feb 14 2025 10:36 PM

● కలెక్టర్‌ పమేలా సత్పతి

కరీంనగర్‌ అర్బన్‌: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రిటర్నింగ్‌ అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల విధుల నిర్వహణపై కలెక్టరేట్‌ ఆడిటోరియంలో గురువారం రిటర్నింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులకు మాస్టర్‌ ట్రైనర్లు శిక్షణ ఇచ్చారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో రిటర్నింగ్‌ అధికారులు ము ఖ్యపాత్ర పోషిస్తారని అన్నారు. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల మేరకు కృషి చేయాలని తెలిపారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, పార్టీ గుర్తుల కేటాయింపు, బ్యాలెట్‌ పద్ధతిలో ఓటింగ్‌ విధానం, ఓట్ల లెక్కింపు, ఎన్నికల నియమావళి తదితర అంశాలపై మాస్టర్‌ ట్రైనర్లు దేవి శ్రీనివాస్‌, టీ.సంపత్‌, ఆర్‌.రవీందర్‌, పరశురాం శిక్షణ ఇచ్చారు.

సఖి సేవలపై అవగాహన కల్పించాలి

కరీంనగర్‌: మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని సఖి కేంద్రం, మహిళా సాధికారత విభా గం సేవలపై ప్రతీ ఒక్కరికి అవగాహన కల్పించాల ని కలెక్టర్‌ పమేలా సత్పతి సూచించారు. సఖికేంద్రం, జిల్లా మహిళా సాధికారత కేంద్రం మేనేజెమెంట్‌ కమిటీ సమావేశం గురువారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరిగింది. కలెక్టర్‌ మాట్లాడుతూ సఖి సేవలను గురించి అందరికీ తెలిసేలా బోర్డులను ఏర్పాటు చేయాలని అన్నారు. వయోవృద్ధుల సమస్యలపై ఆర్డీవో కార్యాలయానికి, ప్రజావాణికి వస్తున్న వారికి అవసరమైన సాయం, కౌన్సెలింగ్‌ అందించాలన్నారు. సఖి కేంద్రానికి వచ్చే బాధిత మహిళలకు ఏదైనా సహాయం కావాలంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే.వెంకటేశ్‌ మాట్లాడుతూ పాఠశాలస్థాయి నుంచి కొంతమంది మత్తుపదార్థాలకు అలవాటు పడడం బాధాకరమన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement