నిరంతర విద్యుత్‌ సరఫరాకు చర్యలు | Sakshi
Sakshi News home page

నిరంతర విద్యుత్‌ సరఫరాకు చర్యలు

Published Sat, May 25 2024 1:00 AM

నిరంతర విద్యుత్‌ సరఫరాకు చర్యలు

● టీజీ ఎన్పీడీసీఎల్‌ సీజీఎం అశోక్‌కుమార్‌

కొత్తపల్లి(కరీంనగర్‌): వినియోగదారులకు నిరంతరం మెరుగైన విద్యుత్‌ సరఫరా చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్‌ సీజీఎం(ఎమ్మార్టీ), ఇన్‌చార్జి డైరెక్టర్‌(హెచ్‌ఆర్డీ) బి.అశోక్‌కుమార్‌ ఆదేశించారు. రేకుర్తి, బొమ్మకల్‌, కొత్తపల్లి, గంగాధర 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్లను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. వర్షాకాలానికి ముందే విద్యుత్‌ లైన్లు సరిచేయాలన్నారు. తీగలకు అడ్డుగా ఉన్న చెట్లకొమ్మల తొలగించాలని సూచించారు. సబ్‌స్టేషన్లు, లైన్ల నిర్వహణ తనిఖీ చేయాలని చెప్పారు. ట్రాన్స్‌ఫార్మర్లలో ఓల్టేజీ సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. జిల్లా స్టోర్స్‌కు వెళ్లకుండా ఆన్‌లైన్‌లోనే అవసరమైన పరికరాలను ఆర్డర్‌ చేయాలని తెలిపారు. టౌన్‌ డీఈ జె.రాజం, డీఈ(ఎమ్మార్టీ) కె.కాళిదాస్‌, కరీంనగర్‌ రూరల్‌ ఏడీఈ కొలుపుల రాజు, ఏఈలు శ్రీనివాస్‌, అశోక్‌ పాల్గొన్నారు.

మెరుగైన సేవలు అందించాలి

వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని, ఇందుకోసం క్షేత్రస్థాయిలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని టీజీ ఎన్పీడీసీఎల్‌ కరీంనగర్‌ సర్కిల్‌ ఎస్‌ఈ గంగాధర్‌ సూచించారు. కరీంనగర్‌లోని విద్యుత్‌ భవన్‌లో కరీంనగర్‌ –1, 2 సబ్‌ డివిజన్ల సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కరీంనగర్‌ టౌన్‌ డీఈ జె.రాజం, ఏడీఈలు నరేందర్‌, సుధీర్‌కుమార్‌, ఏఏవోలు సత్యనారాయణ, సుల్తాన్‌ రవి, ఏఈలు, సబ్‌ ఇంజినీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement