ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పర్యటించనున్న ఎంపీ రాహుల్‌గాంధీ

- - Sakshi

పెద్దపల్లిలో బహిరంగ సభ, కరీంనగర్‌లో పాదయాత్ర..

గురువారం జిల్లాలో పర్యటించనున్న రాహుల్‌గాంధీ..

40 వేల మందితో భారీ బహిరంగ సభ!

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ గురువారం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టిన బస్సుయాత్ర రెండోరోజు పెద్దపల్లిలో కొనసాగనుంది. ఇందుకు సంబంధించి కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు విజయరమణారావుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. రాహుల్‌గాంధీ పాల్గొనే కార్యక్రమాలకు జాతీయ, రాష్ట్ర నాయకత్వం తరలిరానున్న నేపథ్యంలో భద్రతను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.

మంథని–కరీంనగర్‌ పర్యటన ఇలా..
రాహుల్‌గాంధీ గురువారం ఉదయం భూపాలపల్లి జిల్లాలో పర్యటన ముగించుకొని బస్సులో పెద్దపల్లి జిల్లా మంథనిలో ప్రవేశించనున్నారు. అక్కడ కాంగ్రెస్‌ శ్రేణులు ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలి కేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మంథనిలో రోడ్‌ షో లో పాల్గొన్న అనంతరం రామగిరి మండలం సెంటినరీకాలనీలో మధ్యాహ్నం రాష్ట్ర నాయకులతో కలిసి భోజనం చేస్తారు.

తర్వాత సింగరేణి కార్మికులు, రైతులతో సమావేశమవుతారు. వారితో మాట్లాడాక బస్సులో కమాన్‌పూర్‌ చౌరస్తాకు చేరుకొని, రోడ్‌ షోలో పాల్గొంటారు. సబ్బితం నుంచి బైక్‌ ర్యాలీ ద్వారా పెద్దపల్లి బహిరంగ సభకు సాయంత్రం 4 గంటలకు చేరుకుంటారు. భారీ బహిరంగ సభ అనంతరం రాత్రి 7 గంటలకు కరీంనగర్‌ చేరుకొని, 10 గంటల వరకు పాదయాత్ర చేయనున్నారు.

40 వేల మందితో భారీ బహిరంగ సభ..
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జూనియర్‌ కాలేజీ గ్రౌండ్‌లో బహిరంగ సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల కు చెందిన సుమారు 40 వేల మంది పాల్గొననున్నా రు. సభా ప్రాంగణంలో భద్రత ఏర్పాట్లను రాహుల్‌గాంధీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, ఉన్నతాధికారులు, పెద్దపల్లి పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. మాజీ ఎమ్మె ల్యే విజయరమణారావు సభాస్థలిని పరిశీలించారు. కాంగ్రెస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఉమ్మడి జిల్లాపై ఫోకస్‌..
అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకెళ్తున్న కాంగ్రెస్‌ అధిష్ఠానం ఉమ్మడి కరీంనగర్‌పై ప్రత్యేక ఫోకస్‌ పెట్టింది. ఇప్పటికే ఏడుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఉమ్మడి జిల్లాలో బస్సు యాత్ర చేపడుతుండటంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మొత్తం 13 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేసేలా అధిష్ఠానం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

సిటీలో రాహుల్‌ యాత్ర ఇలా..
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ గురువారం కరీంనగర్‌లో పర్యటించనున్నారు. మొగ్దుంపూర్‌ వద్ద నేతలు స్వాగతం పలుకుతారు. నగరంలోని మారుతీనగర్‌ చౌరస్తా నుంచి రాత్రి ఏడు గంటలకు పాదయాత్రగా నాకా చౌరస్తా మీదుగా అశోక్‌నగర్‌ నుంచి రాజీవ్‌చౌక్‌ చేరుకుంటారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ.వేణుగోపాల్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రోహిత్‌చౌదరి, క్రిస్టోఫర్‌తిలక్‌, జీవన్‌ రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, కవ్వంపల్లి సత్యనారాయణ, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి యాత్రలో పాల్గొననున్నారు.

Read latest Karimnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

14-11-2023
Nov 14, 2023, 19:25 IST
రేవంత్‌ రెడ్డి మీద మాత్రమే కాదు.. స్టేషన్‌ ఘన్‌పూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిని ఇందిరపై పలు కేసులు.. 
14-11-2023
Nov 14, 2023, 16:35 IST
కేసీఆర్‌ పోటీ చేస్తున్న గజ్వేల్‌లో అత్యధికంగా 114 నామినేషన్లకు ఆమోదం.. 
14-11-2023
Nov 14, 2023, 15:16 IST
ప్రజల ఆస్తుల్ని గుంజుకోవడానికి కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నాడని..
14-11-2023
Nov 14, 2023, 14:23 IST
కేసీఆర్‌కు ఏం పని లేదు. ప్రజలు కట్టిన పన్నులు రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నడని..
14-11-2023
Nov 14, 2023, 13:50 IST
సాక్షి, మహబూబ్‌నగర్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో శనివారం అర్ధరాత్రి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు...
14-11-2023
Nov 14, 2023, 13:15 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఎన్నికల్లో తొలిఘట్టం నామినేషన్ల పర్వం ముగియడంతో పాలమూరులో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారం ముమ్మరం...
14-11-2023
Nov 14, 2023, 12:49 IST
హైదరాబాద్: గత కొనేళ్లుగా వంటింట్లో మంట పుట్టిస్తున్న వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింపుపై పార్టీల ఎన్నికల హామీలు ఊరట...
14-11-2023
Nov 14, 2023, 12:48 IST
సాక్షిప్రతినిధి, ఖమ్మం: చాలా విషయాల్లో తుమ్మల నాగేశ్వరరావు బ్యాలెన్స్‌ తప్పాడని, ఇప్పుడు ఆయనకు ఓటమి కళ్ల ముందు కనిపిస్తుండడంతో భయం...
14-11-2023
Nov 14, 2023, 12:14 IST
సాక్షి, జగిత్యాల: నేను మీవాడిని.. ఎప్పటికీ మీ వెంటే ఉంటానని బీఆర్‌ఎస్‌ కోరుట్ల అభ్యర్థి డా.సంజయ్‌ అన్నారు. సోమవారం కోరుట్లలోని పట్టణంలోని...
14-11-2023
Nov 14, 2023, 12:05 IST
సాక్షి, హైదరాబాద్‌ ః కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఏమో గానీ ఆరు నెలల కొకసారి సీఎం మారటం మాత్రం పక్కా అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌...
14-11-2023
Nov 14, 2023, 11:53 IST
సాక్షి, జోగులాంబ: అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ల పరిశీలనలో దూమారం రేగింది. బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి నామినేషన్‌పై ఇతర పార్టీల...
14-11-2023
Nov 14, 2023, 11:40 IST
సాక్షి, యాదాద్రి : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బు కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల...
14-11-2023
Nov 14, 2023, 10:51 IST
కొల్లాపూర్‌: ఎన్నికల్లో ఎత్తులకు పై ఎత్తులు.. ఓటర్లను తికమక పెట్టే చర్యలు సహజంగా మారిపోయాయి. కొల్లాపూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఇవి...
14-11-2023
Nov 14, 2023, 10:25 IST
సాక్షి, కరీంనగర్: 'అన్నా.. తమ్మీ.. నామినేషన్‌ వేశావు.. ఈ 15 రోజుల్లో ప్రచారం చేసి, నువ్వు గెలిచేది లేదు.. ఏ ఉద్దేశంతో నామినేషన్‌...
14-11-2023
Nov 14, 2023, 10:11 IST
సాక్షి, ఖమ్మం: శాసనసభ సాధారణ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన పూర్తికాగా, బరిలో మిగిలే అభ్యర్థులెవరో 15వ తేదీన తేలనుంది....
14-11-2023
Nov 14, 2023, 10:01 IST
సాక్షి, మహబూబాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ అభ్యర్థి సింగపురం ఇందిర తన నామినేషన్‌తో పాటు దాఖలు చేసిన అఫిడవిట్‌లో తప్పిదం...
14-11-2023
Nov 14, 2023, 09:22 IST
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారికి వచ్చే ఓట్లు తమకు నష్టం చేస్తాయా? మేలు చేస్తాయా? వారు...
14-11-2023
Nov 14, 2023, 08:09 IST
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల పరిధిలో నామినేషన్ల పరిశీలన (స్క్రూట్నీ) సోమవారం పూర్తయింది. ఈ...
14-11-2023
Nov 14, 2023, 08:04 IST
సాక్షి, కరీంనగర్‌: ఒకప్పుడు చాలా మంది నాయకులు స్వతంత్ర అభ్యర్థులుగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి, సత్తా చాటేవారు. ఉమ్మడి కరీంనగర్‌...
14-11-2023
Nov 14, 2023, 05:21 IST
సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని, వర్గీకరణను అమలు చేసే బాధ్యతను భుజస్కంధాలపై పెట్టుకుందని కేంద్రమంత్రి,... 

Read also in:
Back to Top