కరీంనగర్: ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గురువారం కోర్టు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంలో బీజేపీ మాట ఇచ్చి తప్పిందని, మాదిగలు, ఉపకులాలను మోసం చేసిన బీజేపీకి రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ప్రధానమంత్రి స్వయంగా హామీ ఇచ్చినా ఇప్పటికీ వర్గీకరణ చేయకపోవడం మాదిగ జాతికి అన్యా యం చేయడమే అవుతుందని అన్నారు. అనంతరం ఎమ్మార్పీఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేరెళ్ల సౌమ్య, అంజిబాబు, నాగెల్లి బాబురావు, ప్రేమ్‌కుమార్, రాజయ్య, నర్సన్న, రాజమల్లు, లక్ష్మణ్ పాల్గొన్నారు.