పిట్లం(జుక్కల్) : ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం పిట్లం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రామేశ్వర గుట్ట వద్ద సీడ్ బాల్స్ వేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ చిన్న కొడప్గల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సహకారంతో 1500 సీడ్ బాల్స్ వేశామన్నారు.లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ప్రమోద్ కుమార్, కార్యదర్శి మారుతిరెడ్డి, సభ్యులు, సర్పంచ్ రెడ్డి కిరణ్ కుమార్, ప్రధానోపాధ్యాయురాలు అనురాధ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


