చిన్నపాటి వర్షానికి నిలిచిపోతున్న రాకపోకలు | - | Sakshi
Sakshi News home page

చిన్నపాటి వర్షానికి నిలిచిపోతున్న రాకపోకలు

Jul 29 2026 1:22 AM | Updated on Jul 29 2026 1:22 AM

అసంపూర్తిగా గంగమ్మ వాగు బ్రిడ్జి పనులు

ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

రామారెడ్డి : రామారెడ్డి నుంచి కామారెడ్డికి వెళ్లే ప్ర ధాన రహదారిలో గంగమ్మ వాగు బ్రిడ్జి పనులు అ సంపూర్తిగా ఉన్నాయి. దీంతో చిన్నపాటి వర్షానికే రాకపోకలు నిలిచిపోవడంతో వాహనదారులు ఇ బ్బందులు పడుతున్నారు. 2023లో రూ.3.08కోట్ల ఎఫ్‌డీఆర్‌ నాన్‌ప్లాన్‌ నిధులతో గంగమ్మ వాగు బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టారు. గంగమ్మవాగుపై నుంచి భీమ్‌గల్‌కు ఆర్టీసీ బస్సు 3 ట్రిప్పులు, కామారెడ్డి నుంచి దొన్కల్‌ వయా నిజామాబాద్‌, సిరిసిల్ల నుంచి మాచారెడ్డి మీదుగా కామారెడ్డికి ప్రయాణాలు కొ నసాగిస్తారు.

బురదలో ఇరుక్కుపోయిన బస్సు, లారీ

సోమవారం రాత్రి రామారెడ్డి పరిసర ప్రాంతాల్లో కురిసిన ఓ మోస్తరు వర్షానికే గంగమ్మ వాగు వద్ద ప రిస్థితి ఘోరంగా తయారైంది. బ్రిడ్జి వద్ద వేసిన మొ రం వర్షానికి కరిగిపోవడంతో వాహనాలు జారిపడే ప్రమాదం ఉండటంతో రామారెడ్డి పోలీసులు ముందస్తు చర్యగా రాత్రి రాకపోకలను పూర్తిగా నిలిపివే శారు. మంగళవారం ఉదయం వర్షం తగ్గుముఖం పట్టడంతో రహదారిని పునరుద్ధరించినప్పటికి, బ్రి డ్జి వద్ద పేరుకుపోయిన బురదలో ఒక ఆర్టీసీ బస్సు, లారీ ఇరుక్కుపోయాయి. చివరకు జేసీబీ సహాయంతో అధికారులు, స్థానికులు శ్రమకోర్చి ఆ వాహనాలను బయటకు తీశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్యను పరిష్కరించని పక్షంలో కామారెడ్డి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని రామారెడ్డి, చుట్టుపక్కలా గ్రామాల ప్రజలు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement