మహిళను నమ్మించి రూ.15 వేల అపహరణ | - | Sakshi
Sakshi News home page

మహిళను నమ్మించి రూ.15 వేల అపహరణ

Jul 29 2026 1:22 AM | Updated on Jul 29 2026 1:22 AM

కామారెడ్డి క్రైం: బ్యాంకులో డబ్బులు లెక్కపెట్టుకునే విషయంలో ఓ మహిళను నమ్మించిన ఇద్దరు దుండగడులు రూ.15 వే లు కాజేసిన ఘటన జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. పాల్వంచ మండలం వాడి గ్రామానికి చెందిన చింతకింది పూజ తన తండ్రితో కలిసి మధ్యాహ్నం స మయంలో మున్సిపల్‌ కార్యాలయ సమీపంలోని ఎస్బీఐ బ్యాంకుకు వచ్చారు. రూ.50 వేలు విత్‌డ్రా చేసుకున్నారు. డ బ్బులు లెక్కబెట్టుకునేటప్పుడు అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తుల్లోంచి ఒకరు తాను సహాయం చేస్తానని నమ్మించాడు. డబ్బులను లెక్కబెట్టిన తర్వాత తిరిగి ఇచ్చి వెంటనే అక్కడి నుంచి జారుకున్నారు. అనుమానం వచ్చి మళ్లీ లెక్కించగా నోట్ల కట్టలో రూ.15 వేలు తక్కువగా ఉండటాన్ని గుర్తించిన బాధితులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి తెలిపారు.

పోడు భూముల్లో మొక్కలు నాటిన అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement