గతంలో ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చిన స్థలాలకు సంబంధించి పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ పెద్దకొడప్‌గల్ లోని హరిజనవాడకు చెందిన పలువురు ప్రజావాణికి తరలివచ్చారు. వారు మాట్లాడుతూ.. 30 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం నిరుపేదలకు సర్వే నంబరు 510లో ఇంటి స్థలాలను కేటాయించిందన్నారు. అప్పటి నుంచి కొందరు బేస్‌మెంట్ వరకు నిర్మించుకుని పశువుల పాకలుగా, గడ్డివాములుగా, గుడిసెలుగా వాడుకుంటున్నామని, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు.


