ఎల్లారెడ్డి ప్రజావాణికి రెండు ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

ఎల్లారెడ్డి ప్రజావాణికి రెండు ఫిర్యాదులు

Jul 28 2026 1:12 AM | Updated on Jul 28 2026 1:12 AM

అథ్లెటిక్స్‌ కిడ్స్‌ ఎంపికలు ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శిగా శ్రీధర్‌ నేడు భారతీయ కిసాన్‌ సంఘ్‌ కుటుంబ సమ్మేళనం

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించినట్లు ఆర్డీవో ప్రభాకర్‌ తెలిపారు. ఈకార్యక్రమానికి రెవెన్యూ, మున్సిపాలిటికి సంబంధించి ఒక్కో ఫిర్యాదు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు హాజరైనట్లు తెలిపారు.

కామారెడ్డి అర్బన్‌: జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జావెలిన్‌ డే సందర్భంగా సోమవారం కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో 5వ జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ కిడ్స్‌ ఎంపికలు నిర్వహించారు. క్రీడల్లో ఎంపికై న 40 మంది క్రీడాకారులు ఆగస్టు 7,8 తేదీల్లో హనుమకొండ జేఎన్‌ స్టేడియంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్‌రెడ్డి, అనిల్‌కుమార్‌లు తెలిపారు. ఎంపికై న వారికి పతకాలు అందజేశారు. అసోసియేషన్‌ ప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయులు నవీన్‌, దత్తాద్రి, శ్రీనివాస్‌, మధుసూదన్‌రెడ్డి, శివాగౌడ్‌, నరేశ్‌రెడ్డి, రేణుక, భాస్కర్‌రెడ్డి, అరుణ, విజయ, సరిత తదితరులున్నారు.

కామారెడ్డి అర్బన్‌: జిల్లా స్కూల్‌ గేమ్స్‌ఫెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌) జిల్లా కార్యదర్శిగా ఈ.శ్రీధర్‌ నియమితులయ్యారు. గత బుధవారం డీఈవో మల్లికార్జున్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శిగా డి.హన్మంత్‌రెడ్డి ఎన్నిక కాగా ఆయన తాను అ పదవిలో కొన సాగలేనని తెలపడంతో సీనియర్‌ పీఈటీ శ్రీధ ర్‌ నియమాకం అనివార్యమైంది. ఎస్‌జీఎఫ్‌ జి ల్లా కార్యదర్శిగా శ్రీధర్‌ ఏడాది కాలంపాటు కొ నసాగుతారని డీఈవో పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికా రి వెంకటేశ్వరగౌడ్‌, ఎస్‌జీఎఫ్‌ మాజీ కార్యదర్శి హీరాలాల్‌, పేటా టీఎస్‌ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శు లు మధుసూదన్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, టీజీ పేటా అధ్యక్షుడు స్వామిగౌడ్‌, పీఈటీలున్నారు.

కామారెడ్డి అర్బన్‌: భారతీయ కిసాన్‌ సంఘ్‌ ముఖ్య కార్యకర్తల కుటుంబ ఆత్మీయ సమ్మేళనం మంగళవారం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం వరకు లింగాపూర్‌ బృందావన్‌ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించనున్నట్టు సంఘ్‌ జిల్లా అధ్యక్షుడు పైడి విఠల్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సమ్మేళానానికి భారతీయ కిసాన్‌ సంఘ్‌ రాష్ట్ర నాయకులు హాజరుకానున్నట్టు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement