కుటుంబ సమ్మేళనానికి హాజరు కావాలి
లింగంపేట : భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కుటుంబ సమ్మేళనానికి ప్రతి ఒక్కరూ హాజరుకావాలని సీజీఆర్‌ఎఫ్ మెంబర్ రా జాగౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం లింగంపేట మండలం బాణాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం జిల్లా కేంద్రంలో బృందావన్ గార్డెన్‌లో కు టుంబ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మధుసూదన్‌రెడ్డి, వెంకటేశ్వర్‌గౌడ్, సంగమేశ్వర్, గోపాల్, దర్శన్, లక్ష్మినారాయాణ,సాయన్న, తదితరులు పాల్గొన్నారు.
పిట్లం కేజీబీవీలో అభివృద్ధి పనులు ప్రారంభం
పిట్లం(జుక్కల్): మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సోమవారం సర్పంచ్ శేఖర్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణంతో పాటు మిగిలిపోయిన భవన నిర్మాణ పనుల కోసం రూ. 44.91 లక్షలు మంజూరు కావడంతో పనులు ప్రారంభించమన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తిప్పాపూర్‌లో సిమెంట్‌రోడ్డు నిర్మాణ పనులు..
భిక్కనూరు: మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో సోమవారం సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, సర్పంచ్ కుంట లింగారెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రూ. 15 లక్షలు మంజూరు కావడంతో పనులను ప్రారంభించామన్నారు. పీసీసీ కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు బీంరెడ్డి ఉపసర్పంచ్ జీవన్, విండో చైర్మన్ వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ ద్యావరసాయిరెడ్డి, నేతలు చిన్న నర్సరెడ్డి, ధర్మస్వామి, కోక స్వామి, తాటిపల్లి సిద్దరాములు, దయాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సోమేశ్వర ఆలయంలో భక్తుల పూజలు
నస్రుల్లాబాద్:మండలంలోని దుర్కి గ్రామ శివారు లో గల సోమేశ్వర ఆలయంలో భక్తులు ప్రత్యేక పూ జలు చేశారు.రెండు వారాలుగా అన్నదానం చేస్తు న్నామని ఆలయ కమిటీ సభ్యులు దు ర్గం మహేశ్ తెలిపారు.అన్నదానం చేసే భక్తులు రూ. చెల్లిస్తే ఆ లయ కమిటీ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తామన్నా రు. ఈ సందర్భంగా అన్నదాతలు సుంకరి యుద్దం రూప ప్రకాష్ దంపతులను సన్మానించారు.ఆలయ కమిటీ సభ్యులు,భక్తులు పాల్గొన్నారు.


