సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కస్టం మిల్లింగ్ రై స్ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చ ర్యలతో మిల్లర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే సీఎంఆర్ బకాయి ఉన్న మిల్లర్లపై కేసులు నమోదు చేసిన ప్రభుత్వం ఆర్‌ఆర్ యాక్ట్ అమలు చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇదే సమయంలో పౌరసరఫరాల శా ఖకు సంబంధించిన విజిలెన్స్ విభాగం అధికారులు గురువారం కామారెడ్డిలో ఓ రైస్‌మిల్లులో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.7.50 కోట్ల విలువైన స్టాక్ లేదంటూ మిల్లుపై కేసు నమోదు చేశారు. దీంతో రైస్‌మిల్ వ్యాపారుల్లో ఆందోళన మొదలైంది. తమను ఇబ్బందులకు గురిచేయవద్దంటూ రైస్‌మిల్లర్లు ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసి మొరపెట్టుకున్నారు.
యువత ‘మై భారత్’ పోర్టల్‌లో
నమోదు చేసుకోవాలి
కామారెడ్డి అర్బన్ : యువత ‘మై భారత్’ పో ర్టల్ తమ పేర్లను నమోదు చేసుకోవాలని యువజన, క్రీడల జిల్లా అధికారి ఆర్.వెంక టేశ్వర గౌడ్ ఒక ప్రకటనలో కోరారు. యువతకు స్వచ్ఛంద సేవా, నాయకత్వ వికాసం, బ్లాక్, జిల్లా స్థాయి క్రీడా కార్యక్రమాలు, నై పుణ్యాభివృద్ధి, జాతీయ నిర్మాణంలో భాగస్వామ్యం, వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలను కల్పించేందుకు ‘మై భారత్’ పోర్టల్‌ను కేంద్ర యువజన, క్రీడల శాఖ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మరింత సమాచారం, పోర్టల్ నమోదులో సహాయం కోసం కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలకు గురుకుల విద్యార్థిని
కామారెడ్డి టౌన్ : అంతర్జాతీయ స్థా యి సెయిలింగ్ అండ్ యాచింగ్ పోటీల కు జిల్లా కేంద్రంలో ని అజాంపుర మహా త్మా జ్యోతీబాఫూలే బాలికల గురుకుల పాఠ శాల పదో తరగతి విద్యార్థిని ఎస్.రిశ్విత ఎంపికై నట్లు ప్రిన్సిపల్ పి మాధవి శనివారం తెలిపారు. ఈ నెల 30 నుంచి ఆగస్టు 7 వర కు జరగనున్న ఇంటర్నేషనల్ యాచింగ్ చాంపియన్‌షిప్–2026లో పాల్గొని భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నట్లు పేర్కొన్నా రు. గతంలో జరిగిన జాతీయ స్థాయి పోటీ ల్లో అద్భుత ప్రతిభ కనబరిచి గోల్డ్, సిల్వర్ పతకాలను సాధించినట్లు తెలిపారు. అంత ర్జాతీయ వేదికపై ప్రతిభ చూపి దేశానికి పతకాలు సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తానని విద్యార్థిని రిశ్విత తెలిపింది.
డిగ్రీ ప్రవేశాలకు
నేడు చివరి రోజు
కామారెడ్డి అర్బన్ : డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వహించే ‘దోస్త్’ ఆదివారం ముగుస్తున్నందున విద్యార్థుల సౌకర్యం కోసం తమ కళాశాల కార్యాలయం పని చేస్తుందని కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ కే విజయ్‌కుమార్ తెలిపారు. డిగ్రీ ప్రవేశం కోరే విద్యార్థులు ఈ చివరి అవకాశం వినియోగించుకోవాలని ఆయన కోరారు.
బీజేపీ కౌన్సిలర్లపై చర్యలు తీసుకోండి
● కలెక్టర్‌కు మున్సిపల్ చైర్‌పర్సన్, కాంగ్రెస్ కౌన్సిలర్ల వినతి
కామారెడ్డి టౌన్ : మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో సభా నిబంధనలను ఉల్లంఘిస్తూ, అభివృద్ధి పనులను అడ్డుకుంటున్న బీజేపీ కౌన్సిలర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల ని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి, కాంగ్రెస్ కౌన్సిలర్లు కోరారు. శనివారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్.వై. గిరిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. పట్టణాభివృద్ధి, ప్రజారోగ్యం, మౌ లిక వసతుల కల్పన లక్ష్యంగా నిర్వహించే కౌన్సిల్ సమావేశాలను కొందరు బీజేపీ కౌ న్సిలర్లు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నార ని ఆరోపించారు. సభలో ‘దొంగ ఎజెండా‘ అని ఆరోపిస్తూ తీవ్రమైన అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా, మైకులను పగలగొట్టడం, అధికారిక ఎజెండా పత్రాలను చించివేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దీంతో నిరంతరం జరగాల్సిన అత్యవసర అభివృద్ధి పను లు, నిధుల వినియోగం పూర్తిగా స్తంభించి పోతోందని ఆవేదన వ్యక్తంచేశారు. సమావేశాల వీడియో రికార్డింగ్‌లను పరిశీలించి, కౌ న్సిలర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు షేరు, అంజాద్, వాజీద్, సుల్తానా, లలిత, కళ్లెం సావిత్రి, త హసున్నుసా, అఫ్రీన్ సుల్తానా, మహేశ్, బ బ్లు, జావీద్, గంగాధర్, అఖిల పాల్గొన్నారు.


