బీబీపేట: మండలంలోని తుజల్పూర్ గ్రామంలో వీధికుక్క భీభత్సం సృష్టించింది. గ్రామానికి చెందిన శరత్ తేజ్ అనే నాలుగేళ్ల బాలుడు ఇంటి ఎదుట ఆడుకుంటుండుగా వీధికుక్క దాడిచేసింది. గమనించిన తల్లి మమత వచ్చి కుక్కను తరిమేయగా ఆమైపె కూడా దాడి చేసి గాయపర్చింది. శరత్‌కు చేతులు, కాళ్లకు గాయాలు కాగా, మమతకు కూడా చేతికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
జీవితంపై విరక్తితో
యువకుడి ఆత్మహత్య
నిజామాబాద్ అర్బన్: జీవితంపై విరక్తితో ఓ యువకుడు అశోక్‌సాగర్‌లో పడి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరో టౌన్ ఎస్సై సందీప్ శనివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని సారంగపూర్‌కు చెందిన లివింగ్ స్టోన్ కూలీ పని చేస్తూ జీవించేవాడు. కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. దీంతో జీవితంపై విరక్తితో శుక్రవారం అర్ధరాత్రి అశోక్‌సాగర్‌లో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


