సంక్షిప్తం.. | - | Sakshi
Sakshi News home page

సంక్షిప్తం..

Jul 26 2026 2:32 AM | Updated on Jul 26 2026 2:32 AM

గోడ గడియారాల పంపిణీ

భిక్కనూరు: మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం బహూకరించిన గోడ గడియారాలను సర్పంచ్‌ బల్యాల రేఖ శనివారం పంపిణీ చేశారు. లబ్ధిదారులు వెంటనే తమ ఇళ్ల నిర్మాణ పనులను పూర్తి చేసుకోవాలన్నారు. ఉపసర్పంచ్‌ దుంపల మోహన్‌రెడ్డి,ఈవో మహేష్‌గౌడ్‌,బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బల్యాల సుదర్శన్‌, నేతలు అందె దయాకర్‌రెడ్డి, ద్యాగల కిరణ్‌, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ బిల్లుల కోసం ఆందోళన

నిజాంసాగర్‌(జుక్కల్‌): ఇందిరమ్మ ఇళ్ల స్లాబ్‌ బిల్లులకు చెల్లించాలని కోరుతూ శనివారం జుక్కల్‌ మండలం బస్వాపూర్‌ గ్రామ గేటు వద్ద లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు మంజూరు చేయడంతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టామన్నారు. బేస్‌మెంట్‌, రూప్‌ లెవల్‌ వరకు బిల్లులు ఇచ్చారని, శ్లాబ్‌ బిల్లులకు జాప్యం చేస్తున్నారని లబ్ధిదారులు నిరసన వ్యక్తం చేశారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు పరిశీలన

కామారెడ్డి రూరల్‌: కామారెడ్డి మండలం ఇస్రోజివాడి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు శనివారం తొలి దశలో పిల్లర్‌ గుంతల తవ్వకం పనులను ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ చిందం మల్లేష్‌ మాట్లాడారు. ఉపసర్పంచ్‌ సిద్ధం స్వామి, గ్రామ పెద్దలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల వెరిఫికేషన్‌

లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ముస్తాపూర్‌ గ్రామంలో శనివారం ఇందిరమ్మ ఇల్లు మంజూరైన ఇళ్ల లబ్ధిదారుల వివరాలను ఎంపీడీవో బ్రహ్మానంందం పరిశీలించారు. ఇంటి నిర్మాణం కోసం లబ్ధిదారులు ఎంపిక చేసిన స్థలం పరిశీలించారు. కార్యదర్శి, లబ్ధిదారులు ఉన్నారు.

ఎల్లారెడ్డి ఫైర్‌ ఆఫీసర్‌ వినోద్‌కుమార్‌కు సన్మానం

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి ఫైర్‌ ఆఫీసర్‌గా వినోద్‌కుమార్‌ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఎల్లారెడ్డి ఫైర్‌ స్టేషన్‌లోనే ఇన్‌చార్జి ఫైర్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న సీనియర్‌ ఫైర్‌ ఫైటర్‌ వినోద్‌కుమార్‌కు పదోన్నతి రావడంతో పాటు ఎల్లారెడ్డిలోనే పోస్టింగ్‌ కేటాయిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఫైర్‌ ఆఫీసర్‌ను మైనారిటీ వెల్ఫేర్‌ నాయకులు గయాజుద్దీన్‌, ముకర్రం, ముబీన్‌లు శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.

ఎల్లారెడ్డి ఎస్సైకి...

ఎల్లారెడ్డి ఎస్సై రాజును మైనారిటీ వెల్ఫేర్‌ నాయకులు శనివారం సన్మానించారు. ఎల్లారెడ్డి ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న రాజును మైనారిటీ నాయకులు శాలువాతో సన్మానించారు.

ఎంపీ సురేశ్‌ షెట్కార్‌ని కలిసిన నేతలు

నిజాంసాగర్‌(జుక్కల్‌): జహీరాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు సురేశ్‌ షెట్కార్‌ను శనివారం హైదరాబాద్‌లో ఆగ్రో మాజీ చైర్మన్‌ కాసుల బాల్‌రాజ్‌, కాంగ్రెస్‌నేత వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి కలిశారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు గ్రామాలాభివద్ధికి నిధులు ఇవ్వాలని ఎంపీని కాంగ్రెస్‌ నాయకులు కోరినట్లు చెప్పారు.

గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలి

పిట్లం(జుక్కల్‌): మండల కేంద్రంలో విశ్వహిందూ పరిషత్‌ సభ్యులు మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్‌ రాజ్‌ మాట్లాడారు. విశ్వహిందూ పరిషత్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement