నిలిచిన పాఠశాల గదుల నిర్మాణం | - | Sakshi
Sakshi News home page

నిలిచిన పాఠశాల గదుల నిర్మాణం

Jul 26 2026 2:32 AM | Updated on Jul 26 2026 2:32 AM

నామినేటెడ్‌ పనుల

బిల్లులు వస్తున్నాయి

రేకుల షెడ్లు, వరండాల్లో

తరగతుల నిర్వహణ

గాంధారి మండలంలో

ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

గాంధారి(ఎల్లారెడ్డి): ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ‘మన ఊరు– మన బడి’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ప్రతి మండలంలో కొన్ని పాఠశాలలను ఎంపిక చేసి అవసరం ఉన్న చోట అదనపు గదులతో పాటు మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులను మంజూరు చేసింది. గాంధారి మండలంలో మన ఊరు–మన బడి పథకంలో భాగంగా 27 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో గాంధారి జెడ్పీ ఉన్నత పాఠశాల, నేరల్‌ తండా ప్రాథమికోన్నత పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణాలు చేపట్టారు. నిధులు విడుదల కాకపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్లు నిర్మాణ పనులను అర్ధాంతరంగా నిలిపివేశారు. గాంధారి జెడ్పీ ఉన్నత పాఠశాల భవన నిర్మాణం, బూర్గుల్‌, గుర్జాల్‌ తండాల్లో గదుల నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. నేరల్‌తండాలో బేస్‌మెంట్‌కే పరిమిత మైంది. గాంధారి జెడ్పీ ఉన్నత పాఠశాలలో, నేరల్‌ తండాలో రేకుల షెడ్డుతో పాటు వరండాల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న భవనాల పనులను పూర్తి చేయించి వినియోగంలోకి తేవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

నేరల్‌తండాలో బేస్‌మెంట్‌లో నిలిచిన పాఠశాల భవన నిర్మాణ పనులు

గాంధారి జెడ్పీ ఉన్నత పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న అదనపు గదులు

టెండర్‌ పనుల బిల్లులు రావడం లేదు. కొన్ని పాఠశాలల పనులను నామినేటెడ్‌ చేశారు. ఈనామినేటెడ్‌ పనుల బిల్లులు విడతల వారీగా వస్తున్నాయి. మండలంలోని బూర్గుల్‌, గుర్జాల్‌ తండా పాఠశాలకు చేసిన పనులకు సంబంధించిన బిల్లులు కొన్ని మాత్రమే వచ్చాయి.

– శ్రీహరి, ఎంఈవో, గాంధారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement