కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్‌లోని వివేకానంద రెసిడెన్షియల్ స్కూల్ వేదికగా శనివారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే సీబీఎస్‌ఈ క్లస్టర్–7 బాల, బాలికల కబడ్డీ టోర్నమెంట్2026 అట్టహాసంగా ప్రారంభమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సీబీఎస్‌ఈ పాఠశాలల నుంచి 160 జట్లు.. సుమారు 1,400 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారు. సీబీఎస్‌ఈ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం డిప్యూటీ సెక్రెటరీ – రీజినల్ ఆఫీసర్ జంగం సునీల్ కలిసి జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ వెలిచాల రాజేందర్‌రావు పోటీలను ప్రారంభించారు. విజేత, రన్నరప్ జట్లకు నగదు పారితోషికం అందజేస్తామని రాజేందర్ రావు తెలిపారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
కొనగుతున్న సీబీఎస్‌ఈ క్లస్టర్ ఖోఖో పోటీలు
కరీంనగర్ స్పోర్ట్స్: కరీంనగర్ కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈటెక్నో పాఠశాలలో రెండు రోజులుగా కొనసాగుతున్న సీబీఎస్‌ఈ క్లస్టర్7 ఖోఖో పోటీలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. శనివారం నిర్వహించిన పోటీలను అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వీ నరేందర్ రెడ్డి ప్రారంభించారు. పలు జట్ల క్రీడాకారిణులను పరిచయం చేసుకుని మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రెండో రోజు పోటీలు ఉత్సాహంగా జరుగగా అండర్ 14, 17 విభాగంలో లీగ్ దశ, ప్రీ క్వార్టర్స్ ముగించుకొని క్వార్టర్స్ దశకు చేరుకున్నాయి. నేడు అండర్ 14, 17 విభాగంలో క్వార్టర్స్, సెమీస్, ఫైనల్ పోటీలు జరుగనున్నాయి. నేటితో పోటీలు ముగియనుండగా సాయంత్రం విజేతలకు ట్రోపీలను అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. క్రీడాకారులు, కోచ్లు, మేనేజర్లు పాల్గొన్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి
పాల్గొన్న 160 జట్లు
కరీంనగర్‌లో మూడు రోజుల పాటు
కొనసాగనున్న సీబీఎస్‌ఈ క్లస్టర్ –7 బాల, బాలికల కబడ్డీ టోర్నమెంట్


