శ్మశానవాటిక అభివృద్ధిని అడ్డుకుంటున్నారు | - | Sakshi
Sakshi News home page

శ్మశానవాటిక అభివృద్ధిని అడ్డుకుంటున్నారు

May 26 2026 3:14 AM | Updated on May 26 2026 3:14 AM

కామారెడ్డి టౌన్‌ : జిల్లా కేంద్రంలోని హిందూ శ్మశానవాటిక నిర్మాణానికి, అభివృద్ధికి తాము అన్ని కు లసంఘాల వారితో మాట్లాడి కృషి చేస్తుంటే, కొంద రు నాయకులు అడ్డుకుంటున్నారని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌ రెడ్డి మండిపడ్డారు. సోమవారం జిల్లా కేంద్రంలోని నియోజకవ ర్గ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఎస్‌ ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రెండు శ్మశాన వాటికల ను అభివృద్ధి చేస్తామని ముందుకు వచ్చి జిల్లా ఉన్నతాధికారులను విన్నవించినా అనుమతులు ఇవ్వ డం లేదని మండిపడ్డారు. రాబోయే 10 రోజుల్లో జిల్లా కలెక్టర్‌ను కలిసి శ్మశానవాటిక అభివృద్ధికి అనుమతులు కోరతామని, అధికారులు స్పందించకుంటే అన్ని కుల సంఘాల నాయకులతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కొత్త కమిషనర్‌ బాధ్యతలు చేపట్టిన మూడు రోజులకే నిజామాబాద్‌ వ్యక్తులకు చెందిన 6 ఎకరా ల వెంచర్‌కు హుటాహుటిన అనుమతులు ఎలా ఇచ్చారని నిలదీశారు. గత వర్షాకాలంలో కూలిపోయిన రోడ్డు డివైడర్లను తిరిగి నిర్మించే పనులను కూడా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నారు. కస్తూ ర్బా ఆస్పత్రి వెనకాల మురికి కాలువపై జరుగుతు న్న అక్రమ కట్టడాలను వారం రోజుల్లోగా కూల్చి వేయకపోతే, నేరుగా ఆయా కట్టడాల ముందే కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. టీపీసీసీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి పిడుగు మమత, కౌన్సిలర్‌ మహేష్‌, నాయకులు నర్సాగౌడ్‌, సాయిబాబు, తాటి ప్రసాద్‌, సలీం, చాట్ల వంశీ, తదితరులు పాల్గొన్నారు.

10 రోజుల్లో స్పందించకుంటే

కలెక్టరేట్‌ ముట్టడిస్తాం

అక్రమ వెంచర్లకు అనుమతులు

ఎలా ఇస్తారు

టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

గడ్డం చంద్రశేఖర్‌ రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement