స్టీల్‌ సామగ్రి బ్యాంక్‌ ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

స్టీల్‌ సామగ్రి బ్యాంక్‌ ఏర్పాటు

May 18 2026 6:45 AM | Updated on May 18 2026 6:45 AM

స్టీల్‌ సామగ్రి బ్యాంక్‌ ఏర్పాటు ‘ఉత్తమ బోధనకోసం నిరంతర శిక్షణ కార్యక్రమాలు’ ఈఏపీ సెట్‌లో జిల్లా విద్యార్థుల ప్రతిభ ఆలయ అభివృద్ధికి రూ. 50 వేల విరాళం నేటి నుంచి ‘టూరిజం వీక్‌’

భిక్కనూరు: జంగంపల్లిలో స్టీల్‌ సామగ్రి బ్యాంక్‌ ఏర్పాటు చేశామని గ్రామ హిందూ స మ్మేళన సమితి ప్రతినిధులు తెలిపారు. సమితి అధ్యక్షుడు ప్రశాంత్‌, ప్రధాన కార్యదర్శి బాలకృష్ణాగౌడ్‌, కోశాధికారి మోహన్‌రెడ్డి ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఇటీవల గ్రామంలో నిర్వహించిన హిందూ సమ్మేళనానికి దా తలు ఇచ్చిన విరాళాలలోంచి ఖర్చులుపోను రూ. 16 వేలపైచిలుకు మిగిలాయని, వాటితో స్టీల్‌ ప్లేట్లు, గ్లాసులు కొనుగోలు చేశామని పేర్కొన్నారు. గ్రామస్తులు తమ ఇళ్లలో జరిగే శుభకార్యాలకు వీటిని ఉచితంగా వినియోగించుకోవచ్చన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గ్రామస్తులు ప్లాస్టిక్‌ విస్తరాకులు, గ్లాసులు కాకుండా స్టీల్‌వి వినియోగించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సమితి ఉపాఽధ్యక్షులు శివలింగం, నీల చంద్రం, సలహాదారులు వెంకటస్వామిగౌడ్‌, నారాయణరెడ్డి, సాయిరెడ్డి పాల్గొన్నారు.

కామారెడ్డి అర్బన్‌: శ్రీసరస్వతి శిశుమందిర్‌ ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతాయని శ్రీసరస్వతి విద్యాపీఠం ప్రాంత సంఘటన మంత్రి పతకమూరి శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. శ్రీసరస్వతి శిశుమందిర్‌ ప్రాంత స్థాయి శిశువాటిక ఆచార్య ప్రశిక్షణ వర్గ 20 రోజుల కార్యక్రమం ఆదివారం సాయంత్రం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్యవక్తగా శ్రీనివాస్‌రావు హాజరై మాట్లాడారు. శ్రీసరస్వతి శిశుమందిర్‌ విద్యార్థులకు ఉత్తమ బోధన అందించడం కోసం ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంటామన్నారు. కార్యక్రమంలో అతి థిగా వ్యాపారి కంచర్ల లింగం, శిశుమందిర్‌ జిల్లా కార్యదర్శి రాజారెడ్డి, కామారెడ్డి విద్యామందిర్‌ హైస్కూల్‌ అధ్యక్షుడు శ్యాంసుందర్‌, ప్రతినిధులు గంగారెడ్డి, రంజిత్‌మోహన్‌, శిశువాటిక ప్రముఖ్‌ కొత్తపల్లి ఉమ, ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా సంఘచాలక్‌ శంకర్‌, పాఠశాల ప్రధానాచార్యులు నాగభూషణం, వివిధ పాఠశాలల ప్రశిక్షార్థులు, తల్లిదండ్రులు, ఆచార్యులు, ప్రబంధక్‌లు పాల్గొన్నారు.

కామారెడ్డి అర్బన్‌: టీజీఈఏపీసెట్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారని పట్టణంలోని సాందీపని, విజన్‌ జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలు తెలిపాయి. ఎస్‌.ముస్కాన్‌ 1790వ ర్యాంక్‌, జి.సాత్విక 5615 వ ర్యాంకు, బి.లహరి 6278, శ్రీకాంత్‌రెడ్డి 6505, సాయిప్రజ్వల్‌ 7049, ఎస్‌.ఫాతిమా 7255, సలీం 7311, సాబా ముస్కాన్‌ 7457, కె.సంపత్‌ 7893, షేక్‌ అఖిల్‌ 7972, జె.రిత్విక్‌ 8677, బి.విశాలాక్షి 9824, భవిత్‌కుమార్‌ 9928 ర్యాంకులు పొందారని పేర్కొన్నారు.

మాచారెడ్డి: చుక్కాపూర్‌లోని లక్ష్మీనృసింహస్వా మి ఆలయ అభివృద్ధికి నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన బాలసంకుల కల్యాణి నరసింహారావు దంపతులు ఆదివారం రూ. 50 వేలు అందించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్‌ కమలాకర్‌రెడ్డి దాతలకు స్వామి వారి చిత్రపటాన్ని బహూకరించి సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకుడు పరంధామాచార్యులు, సిబ్బంది సంతోష్‌, దాతల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సుభాష్‌నగర్‌(నిజామాబాద్‌ అర్బన్‌) : ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సోమవారంనుంచి టూరిజం వీక్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించనున్నట్లు జిల్లా పర్యాటకశాఖ అధికారి పవన్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 18న యువ టూరి జం క్లబ్‌ల ఏర్పాటు, 19న పర్యాటక అవగాహన ర్యాలీ, 20న హెరిటేజ్‌ వాక్‌, 21న టూరిజం ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లతో సమావేశం, 22న స్వచ్ఛతా కార్యక్రమాలు, 23న బ్రాండ్‌ కిట్‌ పోస్టర్‌ విడుదల కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రజలు కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement