బాన్సువాడ : పార్టీ సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని చేరడానికి కార్యకర్తలు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి వీజీ గౌడ్ సూచించారు. ఆదివారం బాన్సువాడలో బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుపై కార్యకర్తలతో సమావేశమయ్యారు. బాన్సువాడ నియోజకవర్గంలో 259 పోలింగ్ కేంద్రాలున్నాయని, ప్రతి కేంద్రానికి ఇద్దరు చొప్పున 518 మంది బూత్ కమిటీ సభ్యులతో, 50 మంది సమన్వయ కమిటీ సభ్యులతో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. జనగణన, సర్ కార్యక్రమాలలో పార్టీ కార్యకర్తలు పాల్గొని బోగస్ ఓటర్ల ఏరివేత, 2002, 2003 సంవత్సరంలో ఓటర్ల జాబితాలో తల్లిదండ్రుల ఓట్లు ఉన్నాయో లేదో చూడాలని, లేకపోతే అధికారులకు వివరాలు వెల్లడించాలని సూచించారు.


