‘రైతులు ఆందోళన చెందొద్దు’ | - | Sakshi
Sakshi News home page

‘రైతులు ఆందోళన చెందొద్దు’

May 18 2026 6:45 AM | Updated on May 18 2026 6:45 AM

‘రైతులు ఆందోళన చెందొద్దు’

భిక్కనూరు: రైతులు ఆందోళన చెందవద్దని, ప్రతి గింజా కొనుగోలు చేస్తామని అడిషనల్‌ కలెక్టర్‌ విక్టర్‌ పేర్కొన్నారు. ఆదివారం ఆయన అంతంపల్లిలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూకాలను వేగవంతం చేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైస్‌మిల్లులకు ధాన్యం చేరిన వెంటనే ట్యాబ్‌లో నమోదు చేస్తే బిల్లులు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేవుతాయన్నారు. ఆయన వెంట జిల్లా సహకార శాఖాధికారి రామ్మోహన్‌, విండో చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, సీఈవో శ్రీనివాస్‌ తదితరులున్నారు.

దోమకొండ: సీతారాంపల్లిలోని కొనుగొలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్‌ విక్టర్‌ పరిశీలించారు. కేంద్రం నిర్వాహకులకు కొనుగోళ్లలో పలు సూచనలు ఇచ్చారు. సేకరించిన ధాన్యం బస్తాలను వెంటవెంటనే మిల్లులకు తరలించాలన్నారు. ఆయన వెంట ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement